Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Janaki Kalaganaledu: అఖిల్ గురించి జ్ఞానాంబకు చెప్పిన జానకి..షాక్ లో జ్ఞానాంబ కుటుంబం..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగ

By Ramesh Babu

Published on: September 12, 2022 10:41 AM

Updated on: September 12, 2022 10:42 AM

---Advertisement---

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి బయటికి వెళ్ళింది అనే పక్కింటిని లీలావతి వచ్చి నానా మాటలు అంటూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులు,జ్ఞానాంబ ఇద్దరూ లీలావతిని అరిచి ఆమె నోరు మూయిస్తారు. నా పెద్ద కోడలు పూజ కాకుండా బయటకు వెళ్ళింది అంటే అంతకంటే మరొక ముఖ్యమైన విషయం ఏదో ఉండే ఉంటుంది అది అర్థం చేసుకోకుండా నోటికి వచ్చిన విధంగా వాగొద్దండి అంటూ వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంబ. ఇంతలోనే జానకి, జెస్సిని పిలుచుకొని నేరుగా జ్ఞానాంబ ముందుకు వస్తుంది.

Advertisement

Janaki lands in a tight spot as Akhil deceives her in todays janaki kalaganaledu serial episode

 

జెస్సి ని చూసి అఖిల్ తో పాటు అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. అప్పుడు జ్ఞానాంబ, జానకి నువ్వు పూత వదిలేసి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి కోసమా వెంటనే ఈ అమ్మాయి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు అంటుంది. అప్పుడు జానకి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నా కూడా జ్ఞానాంబ వినిపించుకోదు. అప్పుడు జానకి అర్థం చేసుకోండి అత్తయ్య గారు చాలా ఇంపార్టెంట్ విషయం అని అంటుంది.

అప్పుడు సరే ఇప్పుడు కాదు పూజ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడదాం అని అంటుంది జ్ఞానాంబ. అందుకు జానకి కూడా సరే అని అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి వినాయకుడి పూజ మొదలుపెడతారు. ఇంకా పూజ పూర్తి అయిన తర్వాత జానకి దంపతులు జ్ఞానాంబ దంపతుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంట్లోకి అప్పుడు జానకిని మాత్రమే లోపలికి రమ్మని చెబుతుంది జ్ఞానాంబ.

Advertisement

ఆ తర్వాత అందరి లోపలికి వెళ్ళగా జెస్సి మాత్రమే బయట నిలబడి ఉంటుంది. ఇక అందరూ లోపల ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జానకి అసలు విషయాన్ని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు జ్ఞానాంబ మీ వదిన చెప్పేది నిజమా అని అఖిల్ ని అడగగా వెంటనే అఖిల్ నాకు జెస్సీకి ఎటువంటి సంబంధం లేదు వదిన అపద్దం చెబుతోంది.

అప్పుడు అఖిల్ తన తప్పులేదు అంటూ మొత్తం జానకి మీద నెట్టేస్తాడు. దాంతో రామచంద్ర అఖిల్ పై సీరియస్ అవుతాడు. ఇప్పుడు జెస్సి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అసలు విషయం బయట పెట్టడంతో అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు జ్ఞానాంబ అఖిల్ నీ తనపై ఒట్టేసి నిజం చెప్పమని చెబుతుంది. ఇప్పుడు అఖిల్, జ్ఞానాంబ మీద ఒట్టేసి చెబుతాడు.

అప్పుడు జానకి కన్విన్స్ చేయడం ప్రయత్నించినా కూడా జ్ఞానాంబ, అఖిల్ మాటలే నిజమని నమ్ముతుంది. అప్పుడు జానకి మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నేను చూపిస్తాను అని అనగా అఖిల్ వద్దు వదిన జెస్సి ఎవరితోనో దిగిన ఫోటోలను చూపించి అవే నిజమని చెబుతాడు. అప్పుడు అందరూ కూడా అఖిల్ చెప్పిన మాటలే నిజం అని నమ్ముతారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.