Guppedantha Manasu Dec 28 Today Episode : వసు కొట్టబోయిన చక్రపాణి.. టెన్షన్ పడుతున్న జగతి, మహేంద్ర?

Updated on: December 28, 2022

Guppedantha Manasu Dec 28 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజే ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార వాళ్ళ నాన్న ఎదురు గొడవ పడుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరే తగ్గించుకుంటున్నారు నాన్న మీకేం తక్కువ అయ్యింది అనడంతో పరువు అని గట్టిగా అరుస్తాడు చక్రపాణి. అప్పుడు వసుధార పరువు అంటే మన ఆలోచనలు మన వ్యక్తిత్వం, ఇతరులకు హాని చేయకుండా ధర్మంగా బతకడమే అని అనడంతో చూసావా సుమిత్ర నీ కూతురు పరువు గురించి సూత్రాలు చెబుతోంది అంటే వాళ్ళ నాన్న పరువు గురించి తెలుసుకోవాలంటే చేతగాని వాడిని తను కూడా నమ్ముతోంది అంటూ వసుధార ని అపార్థం చేసుకుంటాడు.

Guppedantha Manasu Dec 28 Today Episode
Guppedantha Manasu Dec 28 Today Episode

అప్పుడు నేను ఏం తప్పు చేశాను నాన్నఅని వసు తో పెళ్లి పీటల నుంచి వెళ్లిపోవడం తప్పు కదా, పెళ్లి పీటల నుంచి వెళ్లిపోయేటప్పుడు ఆ తర్వాత మా నాన్న ఉంటాడా సస్తాడా అన్నది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయావు అది తప్పు కాదా అని అంటాడు చక్రపాణి. అప్పుడు సుమిత్ర వసుధారకి సపోర్ట్ గా మాట్లాడడంతో ఓహో తల్లి కూతురు ఇద్దరు ఒకటయ్యారా అని అంటాడు చక్రపాణి. ఆ తర్వాత అతను అల్లుళ్ల గురించి గొప్పగా చెప్పడంతో నీ అల్లుళ్ళ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. వాళ్ల గురించి తెలిస్తే చెప్పు తీసుకొని కొడతావు అని వసుధార అనడంతో చక్రపాణి వసుధార ని కొట్టబోతాడు.

Advertisement

ఇంతలో సుమిత్ర అడ్డుపడుతుంది. కొడతారా నన్ను కొట్టండి వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసా అని అంటుండగా ఇంతలో రిషి వసుధార ఇంటికి దగ్గరలోకి వచ్చి హారన్ కొడతాడు. అదేంటి రిషి సార్ ఇక్కడికి వచ్చాడా అనగా వాడేవడు అని అనడంతో అన్న మర్యాదగా మాట్లాడండి అని అంటుంది వసుధార. అప్పుడు వసు అక్కడికి వెళుతుండగా చక్రపాణి వెళ్లకుండా అడ్డుకోవడంతో నేను వచ్చాక అన్ని తిరిగా చెప్తాను అని వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చక్రపాణి వాళ్ళ అంతు చూస్తానని బయలుదేరగా సుమిత్ర కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి వద్దంటుంది.

మరొకవైపు రిషి వసుధార కోసం ఎదురుచూస్తూ ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆలోచనలో పడతాడు. అప్పుడు సర్ ఏంటి ఇలా వచ్చారు అనగా అదే మాట వసుధార అనడంతో సరే సరే అవన్ని తర్వాత చెప్తాను మొదట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరుకు కారులో వెళ్తుండగా వసుధర డల్ గా కనిపించడంతో నువ్వు నా దగ్గర ఏదో విషయం రాస్తున్నావు అని అనగా కాలం ఎప్పుడూ ఒకటే లాగే ఉండదు కదా సార్ అని వసుధార కొత్తగా మాట్లాడుతుంది.

ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు ఒక చోటకు వెళ్తారు.. ఎందుకు వసుధార నువ్వు అలా ఉన్నావు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని అడగడంతో లేదు సార్ అని అంటుంది. మరి ఈ ఊరికి వచ్చేటప్పుడు గల గల మాట్లాడి సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు ఇలా ఉన్నావు ఈ కొంత సమయంలో నీలో ఏంటి ఈ మార్పు అని అంటాడు రిషి. నన్ను నువ్వు తిరిగిన ప్రతి ప్రదేశానికి తీసుకెళ్లి మీ పాత స్నేహితులకు పరిచయం చేసి తనే నా భర్త అని గర్వంగా చెప్పుకుంటావని అనుకున్నాను కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు ఎందుకు వసుధార అని అంటాడు రిషి.

Advertisement

అప్పుడు వారిద్దరూ చేతిలో చేయి వేసుకొని బాధపడుతూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసుధార ఎమోషనల్ అవ్వడంతో ఎందుకు ఏడుస్తున్నావు వసుధార అనగా ఇది ఏడుపు కాదు సార్ ఆనందభాష్పాలు అని అంటుంది. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరూ వసుధార, రిషి వాళ్ళ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు.

Read Also : Guppedantha Manasu Dec 27 Today Episode : వసు విషయంలో కొత్త ప్లాన్ వేసిన దేవయాని.. వసు కోసం ఆరాటపడుతున్న రిషి..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel