Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam january 07 Today Episode : చారుశీలను అసహ్యించుకుంటున్న.. సరికొత్త ప్లాన్ వేసిన చారుశీల, మోనిత?

Karthika Deepam january 07 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసో

By Ramesh Babu

Published on: January 7, 2023 8:49 AM

Updated on: January 7, 2023 12:03 PM

Charusheela gets confused with Mounitha s evil plans in todays karthika deepam serial episode

---Advertisement---

Karthika Deepam january 07 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో హేమచంద్ర శౌర్య హిమ లను చూసి బాధపడుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్లో హేమచంద్ర అసలు దీప కార్తీక్ వాళ్ళు ఏం సాధిద్దామనుకుంటున్నారు. బ్రతికినన్ని రోజులు సంతోషంగా ఉండకుండా వాళ్లు బాధపడుతూ ఇలా పిల్లల్ని కష్టపెడుతున్నారు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. సౌర్య వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నారమ్మా అనడంతో మీరు మాతో మాట్లాడకండి అంకుల్ అమ్మానాన్నలను వెతికడానికి వస్తానని చెప్పి మీరు మోసం చేస్తున్నారు అని హేమచంద్ర పై సీరియస్ అవుతారు. అప్పుడు పదండి అమ్మ కారులో వెళ్దాం అనడంతో వద్దులేండి అంకుల్ మళ్ళీ తీసుకొని వెళ్లి ఇంటి దగ్గర దిగబెడతారు అని అంటుంది.

Advertisement
Karthika Deepam january 07 Today Episode
Karthika Deepam january 07 Today Episode

అప్పుడు హిమ వారి ఒప్పందం గురించి చెప్పడంతో హేమచంద్ర మీ బాధ గురించి మీ అమ్మానాన్నలకు తెలియడం లేదమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ముగ్గురు కలిసి వెతుకుదాం పదండి అనడంతో ముగ్గురు కలిసి కారులో వెళ్తారు. మరోవైపు చారుశీల కార్తీక్ ని సొంతం చేసుకోవచ్చు ఆ మోనిత అక్కడే జైల్లో ఉంటుంది అనుకుంటే మళ్ళీ వచ్చింది నాకు లేనిపోని టెన్షన్స్ అన్ని పెట్టింది అనుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. అప్పుడు రా కార్తీక్ నీ గురించి ఆలోచిస్తున్నాను అనడంతో చాలు చారుశీల నీ నాటకాలు నా దగ్గర సాగవు నువ్వు ఆ మోనిత మనిషి అని తెలిసిపోయింది అనడంతో వచ్చి రాగానే నా గురించి అంతా చెప్పింది అనుకుంటూ ఉంటుంది చారుశీల.

నువ్వు చూపించిన ప్రేమకి నాకు ఫ్రెండ్ దొరికింది దీపకు చెల్లెలు దొరికింది అనుకున్నాము కానీ నువ్వు ఆ మోనిత మనిషివి అని తెలిసిన తర్వాత నేను నిన్ను చూస్తే నాకూ అసహ్యం వేస్తోంది అని అంటాడు కార్తీక్. నేను మోనిత మనిషిని అయినా నేను చూపించిన ప్రేమ నిజం అనడంతో చాలు నా దగ్గర నాటకాలు ఆడొద్దు నువ్వు చూపించిన ప్రేమ అన్నీ కూడా అబద్ధాలే అని కార్తీక్ విరుచుకుపడతాడు. ఇంకొకసారి జీవితంలో నీ మొఖం కూడా మాకు చూపించొద్దు అని కార్తీక్ అక్కడినుంచి వెళ్ళిపోతుండగా లోపల నుంచి మోనిత గొంతు వినిపించడంతో మోనితనే కదా సపోర్ట్ చేయడమే కాకుండా ఇంట్లోనే షెల్టర్ కూడా ఇస్తున్నావా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్.

మీరు ఇద్దరి కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు అనడంతో ఏం లేదు కార్తీక్ అనడంతో ఆ మోనితతో అ నిజం ఏంటో తేల్చుకుంటాను అని కోపంతో ఇంట్లోకి వెళ్తాడు కార్తీక్. ఇంట్లో మోనిత బట్టలు అన్ని సర్దుతూ ఇది రిసెప్షన్ కి ఇది మ్యారేజికి ఇది హనీమూన్ కి అంటూ చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ కోపంతో రగిలిపోతూ అక్కడికి వస్తాడు. వచ్చావా కార్తీక్ రా కార్తిక్ నువ్వు ఇక్కడికి వస్తావని తెలిస్తే ఇక్కడికి మకాం మార్చేశాను. అయినా నువ్వు ఒక్కడివే వచ్చావ్ ఏంటి నా ప్లాన్ ప్రకారం మీరిద్దరూ చారుశీల నీ నిలదీయానికి ఇక్కడికి రావాలి కదా అని అంటుంది.

నువ్వేం భయపడకు చారుశీల వీళ్ళు ఎందుకు మమ్మల్ని మోసం చేశారు అని అడగడం తప్ప వీళ్ళు ఏమి చేయలేరు అంటూ కార్తీక్ నీ చేతగాని వాడిలా మాట్లాడుతూ ఉంటుంది. ఏమి చేయలేం అనుకోవద్దు మౌనిక నీలా మేము చెడుగా ఆలోచిస్తే నీకు నాకు తేడా ఉండదు అయినా ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని సీరియస్ అవుతాడు. చూడు కార్తీక్ ఇవన్నీ మన పెళ్లి బట్టలే మన హనీమూన్ కి టికెట్లు కూడా బుక్ చేశాను మన హనీమూన్ ఎక్కడో తెలుసా స్విట్జర్లాండ్ లో అంటూ టికెట్లు కూడా చూపిస్తుంది మోనిత. అప్పుడు దీప కర్మకాండలు అన్నీ అయిపోతాయి అనడంతో ఏం కూసావు అని కార్తీక్ కొట్టడానికి చెయ్ లేపుతాడు.

Advertisement

అప్పుడు నీకు పెళ్లి కావాలా అని చీరలు విసిరేయగా దీప అక్కడికి వచ్చి అవి పట్టుకుంటుంది. ఎందుకు వచ్చావు దీప అనడంతో చెప్పాను కదా కార్తీక్ వస్తుందని అందుకే వచ్చింది అని అంటుంది మోనిత. అంతే చారుశీల కోపంగా చూడటం తప్ప ఏమీ చేయలేదు అని రెచ్చగొడుతూ ఉంటుంది మోనిత. అన్ని బాగున్నప్పుడు ఏమి చేయలేక పోయింది ఇప్పుడు ఆకరిక్షణాల్లో ఉంది ఏం చేస్తుంది అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో దీప వెళ్ళి మోనిత గొంతు పట్టుకుంటుంది. చూసావా దీపక్క తను నా భర్త నా బిడ్డకు తండ్రి నువ్వు చనిపోయాక హనీమూన్ కి వెళ్ళడానికి టికెట్లు కూడా బుక్ చేశాను బట్టలు సర్దుతున్నాను అని అంటుంది మోనిత.

అప్పుడు దీప మోనిత మీదికి వెళ్లడంతో ఆవేశపడకు దీప అని కార్తీక్ ఆపుతాడు. అప్పుడు దీప మళ్లీ కొట్టడానికి వెళ్ళగా కార్తీక్ దీపను ఆపి అక్కడ నుంచి బలవంతంగా తీసుకొని వెళ్లడంతో మోనిత సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు చారుశీల ఎందుకు వాళ్లను అంతలా టార్చర్ చేస్తున్నావు మోనిత అనడంతో ఇంత కోపంతో రగిలిపోతే అంత తొందరగా దీప వెళ్లిపోతుంది అని నవ్వుకుంటూ ఉంటుంది మోనిత. మరొకవైపు శౌర్య ఏడుస్తూ ఉండగా ఇంద్రుడు అక్కడికి వచ్చి ఏం జరిగింది సౌర్యమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అందంతో దీప వాళ్ళను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ బాధపడుతూ తన బాధని ఇంద్రుడితో చెప్పుకుంటూ ఉంటుంది సౌర్య.

మరొకవైపు మోనిత సంతోషంతో ఫ్లూట్ వాయిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి చారుశీల వచ్చి దీనివల్ల నేను కార్తీక్ దృష్టిలో చెడ్డదాన్ని అయ్యాను అనుకుంటూ ఉండగా ఏంటి అలా చూస్తున్నావు చారుశీల అని అంటుంది మోనిత. అప్పుడు వారిద్దరూ దీప వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మరో సరికొత్త ప్లాన్ వేస్తారు. ఇప్పుడు కార్తీక్ మన గురించి మనం ఎలా ఎందుకు చేసామో అని ఎంక్వయిరీ చేస్తాడు అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా అంటూ చారుశీలకు ప్లాన్ వివరిస్తూ ఉంటుంది మోనిత.

Read Also : Karthika Deepam january 06 Today Episode : మోనితని చంపేస్తానని బెదిరించిన కార్తీక్.. మోనితపై సీరియస్ అయిన దీప?

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :