Rohit Sharma : రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని కారు ఇదిగో.. ధర రూ. 4.57 కోట్లు అంట.. కేవలం 3.4 సెకన్లలో 100 కి.మీ రేంజ్!

Rohit Sharma Lamborghini Urus : టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి లంబోర్గిని ఉరుస్‌ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు. ఈసారి అప్‌డేటెడ్ SE వెర్షన్‌ను కొనుగోలు చేశాడు. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్).

ఈ కొత్త కారులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, అనేక అప్‌డేట్ డిజైన్‌లు ఉన్నాయి. డ్రీమ్ 11 ఫాంటసీ క్రికెట్ పోటీ విజేతకు పాత లంబోర్గిని ఉరుస్‌ను ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ ఈ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను కొనుగోలు చేశాడు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో రోహిత్ శర్మకు లంబోర్గిని ముంబై డీలర్‌షిప్ ద్వారా కొత్త ఉరుస్ SE డెలివరీ అవుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోలో SUV కొత్త ఆరెంజ్ కలర్‌లో (అరాన్సియో అర్గోస్) ఉంది. రోహిత్ శర్మ గత బ్లూ కలర్ ఉరుస్ కన్నా భిన్నంగా ఉంటుంది. అయితే, డెలివరీ సమయంలో రోహిత్ ఫొటోలు ఇంకా రివీల్ కాలేదు.

Advertisement

Read Also : Vivo T4 5G : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌‌పై అద్భుతమైన డిస్కౌంట్.. క్రేజీ ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే!

Rohit Sharma : డిజైన్, ఫీచర్లు :

లంబోర్గిని ఉరుస్ SE కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి. కొత్త LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. గత Y-మోటిఫ్ కన్నా భిన్నంగా ఉంటుంది. ఫ్రంట్ బంపర్, బిగ్ గ్రిల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 23-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్పోర్టి లుక్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

Rohit Sharma : పవర్‌ట్రెయిన్, పర్ఫార్మెన్స్ :

లంబోర్గిని ఉరుస్ SE 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 620hp పవర్, 800Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 25.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. మొత్తం పవర్‌ను 800hp, 950Nmకి తీసుకువస్తుంది.

Advertisement

ఎలక్ట్రిక్ మోటారు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో వస్తుంది. ఈ SUV ఎలక్ట్రిక్ మోడ్‌లో మాత్రమే 60 కి.మీ రన్ అవుతుంది. ఈవీ మోడ్‌లో గంటకు 130 కి.మీ వేగంతో పనిచేస్తుంది. గంటకు 0-100 కి.మీ వేగవంతంతో కేవలం 3.4 సెకన్లలో అందుకోగలదు. టాప్ స్పీడ్ గంటకు 312 కి.మీ దూసుకెళ్లగలదు.

Rohit Sharma : ధర ఎంతంటే? :

లంబోర్గిని ఉరుస్ SE ధర విషయానికి వస్తే.. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 కోట్లు ఉంటుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel