Samantha post: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన గ్లామర్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న సమంత తన గ్లామర్ లుక్ తో మాత్రం కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. అయితే మొదటి సినిమా పరిచయంలో హీరో నాగ చైతన్యతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి.. నాలుగేళ్ల సాఫీ దాంపత్య జీవితం.. ఆ తర్వాత విడాకులు. ఈ విషయాలు ప్రతీ ఒక్కటి అందరికీ తెలిసిందే. అయితే అతి తక్కువ సమయంలో తెలగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదాను సంపాదించుకుంది.
అయితే సామ్ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. వీలు దొరికినప్పుడుల్లా తన ఫ్రెండ్స్ తో ట్రిప్స్ వేస్తూ జాలీగా గడుపుతోంది. అయితే అందుకు సంబంధించి తాజాగా సమంత ఓ పోస్ట్ చేసింది. తన స్నేహితురాలు కోసం… నేను నిన్ను మిస్ అవుతున్నాను… త్వరగా వచ్చేయ్ అంటూ తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.