Ys Jagan : జగన్‌కు బిగ్ షాక్.. ‘కమ్మ’ కులంలో కదలిక మొదలైందా..?

Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక వర్గాల రచ్చ మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తమకు ప్రాధాన్యం తగ్గిందని కమ్మ వర్గం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు కమ్మ నేతలకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. అంతేకాకుండా కమ్మ కులానికి చెందిన వ్యాపారులు, బిల్డర్లను వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వేధిస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీకి 30 శాతం మంది కమ్మ ప్రజలు అండగా నిలిచినట్టు తెలుస్తోంది.

ఏపీలో సీనియర్ ఎన్టీయార్ తర్వాత చంద్రబాబు మాత్రమే కమ్మ వర్గానికి చెందిన రెండో ముఖ్యమంత్రి.. ప్రస్తుతం చంద్రబాబు అధికారానికి దూరమయ్యారు. బాబు హయాంలో కమ్మ వర్గానికి గుర్తింపు బాగానే ఉంది. వారికి సుముచిత స్థానం లభించింది. ప్రస్తుతం టీడీపీ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినడంతో అదే కమ్మ సామాజికి వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు ఏపీ ప్రజలు చూస్తున్నారట.. ఆయన కూడా కమ్మ వర్గానికి చెందిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో ఆలోచిస్తున్నారట.. జగన్ కూడా కమ్మ సామాజికి వర్గానికి చెందిన మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీని ఎదురుగా పెట్టి రాజకీయం నడిపిస్తున్నారు.

ఇటీవల కార్తీకమాసం సందర్భంగా జరిగిన మీటింగ్‌లో కొడాలి నాని, వల్లభనేని వంశీపై కమ్మ వర్గం ప్రజలు గుర్రుగా ఉన్నారట.. ఇప్పటికైనా తాము సంఘటితం కాకపోతే రాబోయే రోజుల్లో తమ వ్యాపారాలు, రాజకీయ భవిష్యత్‌కు ముప్పు వాటిల్లనుందని భావించి జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారట.. ఏదేమైనా మళ్లీ చంద్రబాబును గెలిపించుకోవాలని ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నారని తెలిసింది. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకుని కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Read Also : RGV Comments : సిరివెన్నెలపై RGV సిల్లీ కామెంట్స్.. ‘దేవకన్య’లతో ఏంజాయ్ అంటూ..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel