Nara Lokesh : నారా లోకేష్ విషయంలో ఏం జరుగుతోంది? వారి వల్లనేనా ఇదంతా..?!

Updated on: August 4, 2025

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం మంచి దూకుడు మీదున్నారు. ఆయన కొన్ని రోజుల నుంచి వరుసగా ట్వీట్లు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న లోకేష్ ఒక్కసారిగా ఇలా ఫామ్ లోకి రావడం చూసి టీడీపీ శ్రేణులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ సడెన్ గా ఉన్నట్టుండి ఒక్క సారిగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇలా జరిగేందుకు కారణం ఏంటా అని ఆరా తీసిన లోకేష్ బ్యాచ్ కు నమ్మశక్యం కాని నిజాలు తెలిశాయట. సొంత పార్టీ నేతలే లోకేష్ కు అడ్డుతగులుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

నిన్న మొన్నటి వరకూ లోకేష్ పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదని చాలా మంది సీనియర్ నాయకులు ఆరోపించారు. అసలు లోకేష్ వల్లే పార్టీ ఇలా దిగజారిపోతుందని కూడా వారు విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ  అటువంటిదేం లేదని టీడీపీ అనుకూల ఎల్లో మీడియాలో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. అసలు 2014లో టీడీపీ  అధికారంలోకి రావడానికి లోకేషే కారణం అంటూ వార్తలు కూడా వెలువడ్డాయి.

ఈ వార్తలు ప్రసారం అయిన తర్వాత లోకేష్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది .దీంతో అలర్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ బృంద సభ్యులు లోకేష్ గ్రాఫ్ తగ్గించేందుకు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి.  అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో లోకేష్ ను బూచిగా చూపుతూ వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ వేస్తోందని చాలా మంది చెబుతున్నారు. మరి లోకేష్ అండ్ కో ఈ విషయంలో ఏం చేస్తారనేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠగా మారింది.
Read Also : Harish Rao : వారికి కలిసి రాని ఆరోగ్య శాఖ హరీశ్‌కు కలిసొచ్చేనా… కేసీఆర్ ఏం చేయబోతున్నారు? 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel