Amit Shah : ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని నమ్ముకుంటున్న అమిత్ షా.. టీడీపీకి షాక్

Updated on: August 4, 2025

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మొన్న ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి రోజు తాను ఏపీ బీజేపీ గురించి ఆరా తీశారు. బీజేపీ పార్టీ ఒకప్పుడు హిందుత్వ ఎజెండాను పట్టుకుని ఉండేది. కానీ ఇప్పుడు ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రంలో ఉన్న సెంటిమెంటు రాజకీయాలు చేస్తూ దూసుకుపోవాలని చూస్తోంది. అలా ఏపీ బీజేపీ కూడా రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలతో పాటు కమ్మ సామాజిక వర్గం ఇష్యూను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. దీనిపై చర్చించిన అమిత్ షా కమ్మ సామాజిక వర్గం గురించి అన్నీ తాను చూసుకుంటానని చెప్పారు.

ఈ విషయం గురించి కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరికి బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం అంటే ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉండేది. ఈ విషయం మీద కూడా అమిత్ షా ఫోకస్ చేశారు. వారు టీడీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీ మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని ఆయన ఇక్కడి నేతలను ప్రశ్నించారట. అంటే కమ్మ సామాజిక వర్గంలో కూడా టీడీపీ అంటే నచ్చని వారు ఉన్నారని వారిని అక్కున చేర్చుకోవాలని నేతలకు సూచించారు.

బీజేపీ పార్టీ కమ్మ సామాజిక వర్గం ప్రజల కోసం చేసిన విషయాలను కూడా చెప్పాలని ఆయన చెప్పారు. రెండు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతనే బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ చేసిందని ప్రజలకు చెప్పాలని తెలిపారు. అంతే కాకుండా వారికి అవసరమైన అమరావతి రాజధానికి కూడా బీజేపీ సపోర్ట్ చేస్తుందనే విషయాన్ని వారికి వివరించాలని చెప్పారు.

Advertisement

Read Also : Kalvakuntla Kavitha : కవితకు పదవి కోసం కేసీఆర్ భారీ ప్లాన్.. అందుకే ఎమ్మెల్సీగా బండ?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel