Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ys Jagan : 2024 ఎన్నికల్లో జగన్ దారెటు.. కేంద్రంలో ఏ కూటమికి మద్దతు..?

YSRCP-Will-Central-Alliance

Ys Jagan

Ys Jagan : ప్రస్తుతం దేశం మొత్తం 2024 ఎన్నికల గురించే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాజకీయ పరిణామాలు కూడా అందుకు అనుగుణంగా వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు కేంద్రంలో అధికారం అంటే యూపీఏ కూటమి, లేదా ఎన్డీయే కూటమి అనేలా ఉండేది . కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే దేశంలో ఈ రెండు కూటములు కాకుండా మరో కూటమి కూడా పుట్టుకొచ్చేలా కనిపిస్తోంది.

అందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీనియర్ రాజకీయ నేత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసింది. అనంతం దీదీ మాట్లాడిన మాటలు పలువురికి షాకింగ్ గా అనిపిస్తున్నాయి. అసలు యూపీఏ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? అంటూ దీదీ ప్రశ్నించారు.

దీదీ మాటలను చూస్తే దేశంలో ఈ రెండు కూటములు కాకుండా మూడో కూటమి ఖచ్చితంగా వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అలా వీరికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తోడయ్యారు. ఇక కాంగ్రెస్ పొత్తు లేకుండానే వీరు బీజేపీని ఓడించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎవరికి మద్దతిస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. జగన్ యూపీఏకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వడు కనుక ఎన్డీఏకు గానీ కొత్త కూటమికి కానీ మద్దతివ్వొచ్చని అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఎన్డీఏకు మద్దతిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొన్ని రోజులుగా ఎన్డీఏకు దూరంగా ఉంటున్నారు.

Advertisement

ఎన్డీఏతో ఆయన అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడంతో ఆయన ఎన్డీఏ నుంచి వైదొలిగి కొత్త కూటమికి జై కొడతారని చాలా మంది అనుకుంటున్నారు. ఏపీలో కూడా ఎలాగైనా సరే విజయం సాధించాలని జగన్ అండ్ కో భావిస్తుంటుంది. కావున ప్రశాంత్ కిషోర్ జై కొడుతున్న కొత్త కూటమికే ఆయన మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావిస్తున్నారు.  ఇదే జరిగితే మరో సారి ఏపీ ప్రయోజనాలను కొత్త కూటమి వద్ద ఆయన తాకట్టు పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Chandrababu : ఆ విషయం వివరించేందుకు స్వయంగా రంగంలోకి చంద్రబాబు… 

Advertisement
Exit mobile version