Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Wonder Bird : ఏపీలో వింత పక్షి.. షాకైన రైతు ఏం చేశాడంటే? ఫొటో వైరల్!

Wonder Bird : అదో వింతైన పక్షి.. చూడటానికి అచ్చం గుడ్లగూబ మాదిరిగానే ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పక్షిని కాపాడాడు ఓ రైతు. ఏపీలో ఈ వింతైన పక్షి కనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్ర తీరంలో కొబ్బరి తోటలో ఈ పక్షి రైతుకు కనిపించింది. ఈ పక్షిపై కాకులు దాడి చేస్తుండగా.. అక్కడి రైతు వెంటనే దాన్ని రక్షించాడు. అనంతరం ఆ పక్షిని పైకి ఎగిరేయడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ వింతైన అరుదైన ... Read more

By Vinod Kumar

Published on: March 17, 2022 5:03 PM

Updated on: March 17, 2022 5:03 PM

Wonder Bird : Rare Bird like Owl found injured after other birds attack, Farmer saved bird in west godavari district

---Advertisement---

Wonder Bird : అదో వింతైన పక్షి.. చూడటానికి అచ్చం గుడ్లగూబ మాదిరిగానే ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పక్షిని కాపాడాడు ఓ రైతు. ఏపీలో ఈ వింతైన పక్షి కనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్ర తీరంలో కొబ్బరి తోటలో ఈ పక్షి రైతుకు కనిపించింది.

ఈ పక్షిపై కాకులు దాడి చేస్తుండగా.. అక్కడి రైతు వెంటనే దాన్ని రక్షించాడు. అనంతరం ఆ పక్షిని పైకి ఎగిరేయడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ వింతైన అరుదైన పక్షి అటవీ ప్రాంతంలో సంచరించే గుడ్ల గూబ జాతికి చెందినదిగా జంతు శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

రాత్రి సమయాల్లోనే ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చిన్న పక్షులు, పాములను వేటాడి తమ ఆహారంగా తింటుంటాయి. పశ్చిమ తీర ప్రాంతంలో ఇలాంటి వింత పక్షులు కనిపించడం ఇదే మొదటిసారిగా రైతులు చెబుతున్నారు. రైతు చేతులతో పట్టుకున్న ఆ వింత పక్షి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎండాకాలం కావడంతో ఆహారం వెతికే క్రమంలో ఇలా చెట్లపై నుంచి కిందపడి ఉంటుందని రైతులు అంటున్నారు. ఏదిఏమైనా ఆ పక్షి ప్రాణాలను నిలబెట్టిన రైతన్నకు పక్షి ప్రేమికులు ధన్యవాదాలు చెబుతున్నారు.

Read Also : Crime News: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన మహిళలు..!

Advertisement

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.