Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral Video : పొటెత్తిన వరదలోకి ఒక్కసారిగా దూకేసిన యువకుడు.. సీన్ కట్ చేస్తే ఇంట్లో.. షాకింగ్ ట్విస్ట్..!

Viral Video : ఒకవైపు వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వరద బీభత్సానికి అక్కడి ఇళ్లు కూడా మునిగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక యువకుడు అక్కడి వరద నీటి ప్రవాహంలోకి దూకేశాడు. అక్కడే ఉన్న అధికారులు సహా స్థానికులు షాకయ్యారు. ఆ తర్వాత అతడి కోసం ఎంతగా గాలించిన ఆచూకీ లభించలేదు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా షురూ చేశారు. అయినా యువకుడు జాడ తెలియలేదు. ... Read more

By Vinod Kumar

Published on: July 29, 2022 6:13 PM

Updated on: July 29, 2022 6:13 PM

Viral Video _ Young Man Jumped into Flood Water on Tension Among Officials

---Advertisement---

Viral Video : ఒకవైపు వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వరద బీభత్సానికి అక్కడి ఇళ్లు కూడా మునిగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక యువకుడు అక్కడి వరద నీటి ప్రవాహంలోకి దూకేశాడు. అక్కడే ఉన్న అధికారులు సహా స్థానికులు షాకయ్యారు. ఆ తర్వాత అతడి కోసం ఎంతగా గాలించిన ఆచూకీ లభించలేదు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా షురూ చేశారు. అయినా యువకుడు జాడ తెలియలేదు. మొత్తానికి అతడో ఎవరో తెలుసుకుని ఇంటికి వెళ్లి చూసేసరికి హాయిగా నిద్రపోతూ కనిపించాడు.

Viral Video _ Young Man Jumped into Flood Water on Tension Among Officials
Viral Video _ Young Man Jumped into Flood Water on Tension Among Officials

అతన్ని చూసిన అధికారులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేం ట్విస్ట్ రా బాబోయ్ అనుకున్నారంతా.. కళ్ళ ముందు వరద నీటిలోకి దూకిన యువకుడు ఇలా ఇంట్లో నిద్రించడం ఏంటి అని కాసేపటివరకూ అధికారులు తేరుకోలేదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో జరిగింది. డాంగియావాస్ ప్రాంతంలోని బిసల్‌పూర్ ప్రాంతంలో ఒక యువకుడు వరద నీటికలోకి దూకాడు. అక్కడివారు ఎవరో అతడు వరదనీటిలోకి దూకుతుండగా మొబైల్‌లో వీడియో రికార్డు చేశారు. అయితే తాను వరద నీటిలోకి దూకిన తర్వాత జరిగిన తతంగం అంతా తనకు తెలియదని అంటున్నాడు యువకుడు ఘాసిరామ్. జోధ్‌పూర్‌లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాంతాలు జలమయ్యాయి.

అదే సమయంలో మేఘవాల్ నదిలో యవకుడు ఈత కొట్టేందుకు దూకేశాడు. అది ఎవరికీ కనిపించలేదు. యువకుడు నీటమునిగి చనిపోయాడని అంతా అనుకున్నారు. అధికార యంత్రాంగం, ఎస్‌డిఎం, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర ఎమ్మెల్యేలు అందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డైవర్ల సాయంతో యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయినా ఎలాంటి సమాచారం అందలేదు. రోజంతా చుట్టుపక్కల ప్రజలంతా గుమిగూడారు. యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడన్న వార్త వ్యాపించింది. అసలు విషయం ఏంటంటే.. యువకుడు గత ఈతగాడు అంట.. ఎంతటి వరద ప్రవాహంలో దూకినా కూడా నేరుగా ఈదుకుంటూ వెళ్లగలడు.. ఆ తర్వాత ఇంటికి వెళ్లి నిద్రపోతాడట..

Read Also : Viral video: విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న టీచరమ్మ..!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.