Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

TTD Snake Catcher : వేలాది పాములను ఒంటిచేత్తో పట్టాడు.. పాము కాటుకు గురై ఇలా..!

TTD Snake Catcher : అతడో స్నేక్ క్యాచర్.. పాము ఉందనే సమాచారం అందడమే ఆలస్యం.. క్షణాల్లో అక్కడి వాలిపోతాడు. ఎంతటి విషపునాగునైనా చిటికెలో పట్టేస్తాడు. అతగాడికి పాములు పట్టడంలో తిరుగులేదు. కోడెనాగునైనా తనదారికి తెచ్చుకోగల సమర్థుడు.. ఇప్పటివరకూ పదివేలకు పైగా పాములను పట్టాడు.. అతడే.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు.. టీటీడీలో కనిపించే పాములను పట్టి వాటిని సురక్షతమైన ప్రాంతాల్లో విడిచిపెడుతుంటాడు. అయితే అతడిని విషపూరితమైన పాము కాటేసింది. పామును పట్టే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. ... Read more

By Vinod Kumar

Published on: January 30, 2022 7:21 AM

Updated on: January 30, 2022 7:20 AM

ttd-snake-catcher-bhaskar-naidu-admited-in-hospital-after-snake-bite-while-on-catching

---Advertisement---

TTD Snake Catcher : అతడో స్నేక్ క్యాచర్.. పాము ఉందనే సమాచారం అందడమే ఆలస్యం.. క్షణాల్లో అక్కడి వాలిపోతాడు. ఎంతటి విషపునాగునైనా చిటికెలో పట్టేస్తాడు. అతగాడికి పాములు పట్టడంలో తిరుగులేదు. కోడెనాగునైనా తనదారికి తెచ్చుకోగల సమర్థుడు.. ఇప్పటివరకూ పదివేలకు పైగా పాములను పట్టాడు.. అతడే.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు..

టీటీడీలో కనిపించే పాములను పట్టి వాటిని సురక్షతమైన ప్రాంతాల్లో విడిచిపెడుతుంటాడు. అయితే అతడిని విషపూరితమైన పాము కాటేసింది. పామును పట్టే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. వెంటనే టీటీడీ అధికారులు అతన్ని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యానికి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింవది. రాత్రిపూట పామును పట్టే సమయంలో భాస్కర్ నాయుడుని పామ కరిచింది. ఫారెస్ట్ మజ్దూర్‌గా రిటైర్ అయిన భాస్కర్ నాయుడు సేవలను టీటీడీ ఇప్పటికీ కొనసాగిస్తోంది. తిరుమలలో కనిపించే చాలా పాములను పట్టుకుని వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలివేయడం అతని పని.. చాకచక్యంగా పామును పట్టేసుకుంటాడు.

పాము కనిపించిందంటే వెంటనే అక్కడి స్థానికులు టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందిస్తారు. ఇప్పుడా ఆ వ్యక్తి పాము కాటుకు గురికావడంపై అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణపాయం నుంచి బయటపడాలని వేడుకుంటున్నారు.

Read Also : చికెన్.. మటన్.. చేపలు.. ఏది హెల్త్‌కు మంచిందంటే?

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.