Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Southwest Monsoon in India: ఈ ఏడాదంతా సాదారణ వర్షపాతమేనట..!

నైరుతి రుతు పవనాల కారణంగా దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదు కానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీర్ఘ కాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా ... Read more

By Vinod Kumar

Published on: April 14, 2022 2:59 PM

Updated on: April 14, 2022 2:59 PM

---Advertisement---

నైరుతి రుతు పవనాల కారణంగా దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదు కానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీర్ఘ కాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయవ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వెల్లడించింది.

గత మూడేళ్లలో కూడా భారత్‌లో నైరుతి రుతు పవనాల కారణంగా సాధారణ వర్షపాతమే నమోదు అయిందని స్పష్టం చేసింది. నైరుతి రుతు పవనాలకు సంబంధించి మే నెలాఖరులో వాతావరణ శాఖ మరింత స్పష్టత ఇస్తుంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య గల కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. అయితే అలాగే పరిగణించి ఈ ఏడాది కురవబోయే వర్షం గురించి సూచనలు చేస్తున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.