వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam: మోనిత ప్లాన్ సక్సెస్..బాధతో కుమిలిపోతున్న వంటలక్క..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కావాలనే ఫుడ్ పాయిజింగ్ అయింది అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ డ్రైవర్ శివని పిలిచి వెంటనే మోనితను హాస్పిటల్ కీ పిలుచుకొని వెళ్దామని అంటాడు. అప్పుడు కార్తీక్ డాక్టర్ ఏమైంది అని అడగగా ఫుడ్ పాయిజన్ ... Read more

By Ramesh Babu

Published on: September 6, 2022 8:45 AM

Updated on: September 6, 2022 8:45 AM

---Advertisement---

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కావాలనే ఫుడ్ పాయిజింగ్ అయింది అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ డ్రైవర్ శివని పిలిచి వెంటనే మోనితను హాస్పిటల్ కీ పిలుచుకొని వెళ్దామని అంటాడు. అప్పుడు కార్తీక్ డాక్టర్ ఏమైంది అని అడగగా ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి మోనితని లోపలికీ తీసుకొని వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మోనిత ఏమి జరుగనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ అక్కడికి రావడంతో వెంటనే డాక్టర్, మేడంకి ఫుడ్ పాయిజన్ అయింది కరెక్ట్ సమయానికి తీసుకువచ్చారు.

లేదంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది అని డాక్టర్ మరింత నటిస్తాడు. ఇంతలోనే సౌర్య, వారణాసి ఇద్దరూ అదే హాస్పిటల్ కి వస్తారు. అప్పుడు ఫుట్పాయిజింగ్ ఎలా అయ్యింది అని కార్తీక్ ఆలోచిస్తూ ఉండగా మోనిత కావాలని దీప పేరు చెప్పి లేనిపోనివ్వండి సృష్టిస్తుంది. అప్పుడు కార్తీక్ దీపం మీద కోపంతో రగిలిపోతూ ఇంటికి బయలుదేరుతాడు.

మరోవైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయాల గురించి ఆనందంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ కోపంతో అక్కడికి వస్తాడు. అప్పుడు సంతోషంతో దీప చెప్పండి డాక్టర్ బాబు అని అనడంతో నేను మీ డాక్టర్ బాబుని కాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటూ దీప మీద సీరియస్ అవుతాడు కార్తీక్.

నా భార్యకే విషయం పెడతావా నా భార్యను చంపేసి మతిమరుపు వాడిని కదా రెండు మూడు రోజుల్లో కదా మరిచిపోయి తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నావా. భార్యను మర్చిపోయే అంత మతిమరుపు లేదు నాకు. భార్యాభర్తలు ఏడు జన్మల బంధం అంటూ దీప మీద ఫైర్ అవుతాడు కార్తీక్. అప్పుడు దీపఎంత నచ్చి చెప్పడానికి ప్రయత్నించినా కార్తీక్ మాత్రం వినిపించుకోకుండా దీపం మీద ఫైర్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అప్పుడు మోనిత చేసిన పనికి వంటలక్క ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు శౌర్య వారణాసి ఇద్దరు కూర్చుని దీప కార్తీక్ ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సౌర్య దీప ని తలుచుకొని మరింత ఎమోషనల్ అవుతుంది. మరోవైపు డాక్టర్ బాబు వాళ్ళ అమ్మ దీప ముగ్గురు కలిసి జరిగిన విషయం గురించి కోపంతో రగిలిపోతూ ఉంటారు. దీప ఎమోషనల్ అవుతూ ఉండగా డాక్టర్ బాబు వాళ్ళ అమ్మ మాత్రం మోనిత మీద ఫైర్ అవుతూ ఉంటుంది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel