Karthika Deepam: సౌందర్యని మోసం చేస్తున్న ఇంద్రుడు దంపతులు.. మోనితపై కోపంతో రగిలిపోతున్న సౌందర్య?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో హిమ బాధపడుతూ ఉండగా ఆనందరావు ఓదారుస్తూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్లు కార్తీక్ దేవుడికి మొక్కుకుంటూ నేను ఏ రోజు నేను అది కావాలి ఇది కావాలని విసిగించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులలో నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేదు దీపను రక్షించు. దీప ఎన్నో వ్రతాలు పూజలు చేసింది కదా అయినా కూడా నీకు కనికరం లేదా స్వామి దీపకు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వు అని హారతి ఇస్తూ ఉండగా అప్పుడు ఆ శబ్దానికి దీప నిద్ర లేస్తుంది. అప్పుడు దీప పైకి లేవడానికి ప్రయత్నిస్తుండగా లేవలేకపోవడంతో నాకు ఏమయింది. నేను ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నాను శక్తి లేకుండా పోతుంది అని అనుకుంటూ బలవంతంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలోనే అక్కడికి కార్తీక్ పంచ కట్టుకొని హారతి తీసుకుని రావడంతో అది చూసి దీప సంతోషపడుతుంది.

Advertisement

తర్వాత పైకి లేయడానికి ప్రయత్నించగా కింద పడిపోతుంది జాగ్రత్త దీప అని అంటాడు. ఇందాక లేవలేకపోయాను డాక్టర్ బాబు అనడంతో నీకేం కాదు దీప నేను దేవుడిని ప్రార్థించాను దేవుడు నీకు ఆరోగ్యం బాగా అయ్యేలా చూస్తాడు ఆ దేవుడిని నేను కోరుకున్నాను అనడంతో అవునా డాక్టర్ బాబు అని కళ్ళకు హారతి అద్దుకుంటుంది దీప. ఆ దేవుడిని నేను ప్రార్థించాను మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాము అని అంటాడు. మరొకవైపు చారుశీల దగ్గరికి సడన్గా సౌందర్య వెళ్లడంతో ఏంటి ఈవిడ ఇలా సడన్గా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సౌందర్య కార్తీక్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ చారుశీలకూ ఇవ్వడంతో అది చూసి చారిశీల ఏంటి ఈవిడ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చిందా అని ఆ పేపర్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది.

ఏంటమ్మా అలాగే చూస్తున్నావు అని అంటూ ఏమీ లేదు ఆంటీ ఇవి అచ్చం నా అక్షరాలాగే ఉన్నాయి అనడంతో కాదు నా కొడుకు అక్షరాలు అని అనగా సాధారణంగా చాలా వరకు డాక్టర్ల హ్యాండ్ రైటింగ్ కొంచెం ఒకేలా ఉంటుంది కాకపోతే నాది మీ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉన్నట్టుంది అని అబద్ధం చెపుతుంది చారుశీల. ఇంద్రుడు అబద్ధం చెబుతున్నాడేమో అని మీ దగ్గరికి ఎంతో ఆశతో వచ్చాను కానీ ఆ ఆశలు మొత్తం ఆవిడయ్యాయి అని అంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఇంతలో చారుశీల ఆంటీ నేను మిమ్మల్ని పదేపదే ఆంటీ అని పిలుస్తున్నాను కదా మీకు ఇబ్బందిగా ఉందా అని అనడంతో అదేం లేదు.

కానీ నువ్వు ఆంటీ అని పిలిచిన ప్రతిసారి మోనిత అనే ఒక పనికిమాలినదే ఉంది అది మా జీవితాలను నాశనం చేసింది అనడంతో చారుశీల షాక్ అవుతుంది. నువ్వు ఆంటీ అన్న ప్రతిసారి నాకు ఆ పనికిమాలినదే గుర్తుకు వస్తుంది అని సౌందర్య కోపంతో మాట్లాడుతుంది. దాంతో చారుశీల షాక్ లో అలాగే చూస్తుండగా నేను నిన్ను దానితో పోల్చానని బాధపడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌందర్య. తర్వాత సౌందర్య ఇంటికి వెళ్లి ఆనంద్ రావు గారు మీరు దేవుడిని కొడుకు కోడలు కనిపించాలని ముక్కోండి. మీరు ఇంట్లోనే హిమ, సౌర్యలను చూస్తూ ఉండండి నేను వెళ్ళొస్తాను అని బయలుదేరుతుంది. ఇంతలో అంజి అక్కడికి రావడంతో అంజి నువ్వు ఒక్క నిమిషం బయటకు వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది.

Advertisement

అప్పుడు ఇంద్రుడు కార్తీక్ ని వెతకడానికి వెళ్దాం పద అనడంతో టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో చంద్రమ్మని అక్కడికి పిలిచి అప్పుడు ఇంద్రుడు చేయి తీసుకుని చంద్రమ్మ మీద పెట్టి నీ భార్య మీద ఒట్టేసి నీకు ఏమీ తెలియదని చెప్పు అనడంతో ఇంద్రుడు షాక్ అవుతాడు. నువ్వు నీ భార్య మీద ఒట్టేసి చెబుతున్నావు ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు అని అంటుంది. రెండు రోజుల్లో నీ భార్య అంటే నీకు పంచప్రాణాలని నాకు అర్థం అయింది ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పలేవు అని అంటుంది సౌందర్య. నిజం చెప్పు చంద్రమ్మ ఇంద్రుడు అని చేతులు జోడించి వేడుకుంటూ బాధతో అడుగుతుంది సౌందర్య. అప్పుడు ఇంద్రుడు తడబడుతూ చేయి తీసేస్తూ ఉండగా వెంటనే చంద్రమ్మ తనపై చేయి పెట్టుకొని ఎందుకు తడబడుతున్నావు గండ నీకు నిజం తెలియదని నా మీద ఒట్టేసి చెప్పు అని అబద్ధం చెబుతుంది.

దాంతో ఇంద్రుడు నా భార్య మీద ఒట్టేసి చెబుతున్నాను నిజంగా నాకు ఏమీ తెలియదు అని అబద్ధం చెబుతాడు. దాంతో సౌందర్య బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సౌందర్య అంజి ఇద్దరు కలిసి కార్తీక్ వాళ్ళను వెతకడానికి వెళుతూ ఉంటారు. కొత్తపేట అనే ఊరి దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉంటారు. వైపు కార్తీక్ నిద్రలేచి చూసేసరికి పది అయ్యింది అని దీప అని పిలుస్తూ బయటకు వెళ్ళగా దీప వంట చేస్తుండడంతో కోపంతో మాట్లాడుతాడు కార్తీక్. నాకు ఏమైంది డాక్టర్ బాబు మీరు నన్ను ఇలాగే వంటలు చేయకుండా ఉండనివ్వకండి అని బాధగా మాట్లాడుతుంది దీప. బ్రతికేది కొద్ది రోజులే కదా డాక్టర్ బాబు చనిపోయేంత వరకు అయినా నాకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను బ్రతికినివ్వండి అనడంతో కార్తీక్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలోనే అంజి సౌందర్య ఇద్దరు కార్తీక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కారు ఆపి లోపలికి వెళ్తుంటారు. అప్పుడు దీప,కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel