Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Snake fest: అది పాముల పండుగ.. పాములు పట్టుకుని విన్యాసాలు, నృత్యాలు మీరూ చూసేయండి!

Snake fest: కొన్ని పండగలు, ఆచారాలు భలే వింతగా ఉంటాయి. అయితే కొత్తగా చూసే వారికి వింతగా అనిపించినా.. అవి పాటించే వారికి మాత్రం సంప్రదాయబద్ధంగానే ఉంటుంది. బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా మన్సూర్ చౌక్ మండలం ఆగాపూర్ గ్రామంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన ఓ వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నాగ పంచమి రోజు నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత పాలు పట్టుకుని పుట్ట వద్దకు ... Read more

By Vinod Kumar

Published on: July 20, 2022 8:00 PM

Updated on: July 20, 2022 5:07 PM

---Advertisement---

Snake fest: కొన్ని పండగలు, ఆచారాలు భలే వింతగా ఉంటాయి. అయితే కొత్తగా చూసే వారికి వింతగా అనిపించినా.. అవి పాటించే వారికి మాత్రం సంప్రదాయబద్ధంగానే ఉంటుంది. బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా మన్సూర్ చౌక్ మండలం ఆగాపూర్ గ్రామంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన ఓ వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నాగ పంచమి రోజు నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత పాలు పట్టుకుని పుట్ట వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి ఆ దేవతను ఆరాధిస్తారు. కోరుకున్న కోరికలు తీర్చమని వేడుకుంటారు. అయితే బీహార్ లోని ఆగాపూర్ గ్రామంలో నాగ పంచమి వేడుకలు కొంత భిన్నంగా జరుగుతాయి. కానీ చాలా ఘనంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు.

Advertisement

భగత్ అని పిలిచే పూజారాలు గ్రామంలోని భగవతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం డప్పు వాయిద్యాలతో గండక్ నది వద్దకు చేరుకుంటారు. నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అనంతరం నీటి లోపలి నుండి పాములను బయటకు తీసి వేడుక చేస్తారు. ఇలా పాములు తీయడాన్ని అక్కడి ప్రజలు పుణ్య కార్యంగా భావిస్తారు. భగత్ లు ఇలా పాములు తీయగానే గ్రామస్థులు చప్పట్లు, ఈలలు, కేకలతో సంతోషం వ్యక్తం చేస్తారు. కొందరైతే నోటితోనూ పాములను పట్టుకుంటారు. ఈ పాములతో విన్యాసాలు చేస్తూ గ్రామంలోకి వెళ్తారు. ఈ పాములకు కొన్నింటికి విషం ఉంటుంది. అయినా ఆ పూజారులు ఎవరూ భయపడరు. ఆ పాములు కూడా వారిని ఏమీ అనవని అక్కడి వారు చెబుతుంటారు. వేడుకల తర్వాత ఆ పాములను తీసుకెళ్లి పొదల్లో వదిలి పెడతారు.దాదాపుగా 300 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.