వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Guppedantha Manasu: వసుని అపార్థం చేసుకున్న రిషి.. జగతి, మహేంద్ర ఏం చేయనున్నారు..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గౌతమ్, దేవయానికి ఫోన్ చేసి కాలేజీ లో గొడవ జరుగుతుంది అని చెబుతాడు. పెదనాన్న ఉన్నాడ పెద్దమ్మా అని అడుగుతాడు. అప్పుడు దేవయాని మాట్లాడుతూ రిషి ఎక్కడికి వెళ్ళాడు అని అడగగా ఇప్పుడే బయటికి వెళ్లారు పెద్దమ్మ పెద్దనాన్న పంపించండి అని అడుగుతాడు గౌతమ్. మరొకవైపు రిషి, వసు ... Read more

By Ramesh Babu

Published on: March 29, 2022 11:04 AM

Updated on: March 29, 2022 11:04 AM

---Advertisement---

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

గౌతమ్, దేవయానికి ఫోన్ చేసి కాలేజీ లో గొడవ జరుగుతుంది అని చెబుతాడు. పెదనాన్న ఉన్నాడ పెద్దమ్మా అని అడుగుతాడు. అప్పుడు దేవయాని మాట్లాడుతూ రిషి ఎక్కడికి వెళ్ళాడు అని అడగగా ఇప్పుడే బయటికి వెళ్లారు పెద్దమ్మ పెద్దనాన్న పంపించండి అని అడుగుతాడు గౌతమ్.

మరొకవైపు రిషి, వసు కారులో ప్రయాణిస్తూ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు అయిన విషయం గురించి ఫన్నీ గా గొడవ పడుతుంటారు. అప్పుడు రిషి తో మినిస్టర్ గారు మీకు ఏం చెప్పినా కాదు కూడదు వద్దు అనే సమాధానాలు చెప్పకండి అని అంటుంది. కోపం వచ్చిన రిషి, వసు ని కాలేజ్ దగ్గర వదిలిపెట్టి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాడు.

ప్రైమ్ మినిస్టర్ రిషి, జగతి, మహేంద్ర లను ఒకే చోట చూడటం ఆనందంగా ఉంది అని చెబుతాడు. ఇక మినిస్టర్ మాటలకు రిషి లోలోపల కోపంతో రగిలి పోతూ ఉంటాడు. మినిస్టర్ మాట్లాడుతూ మీరు ఎప్పటిలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలి అని అనడంతో జగతి, రిషి వైపు చూస్తుంది.

లేకపోతే ఈ ప్రాజెక్టు విషయంలో మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అనడంతో అప్పడు రిషి ఏదో సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు ధనుష్ అనే స్టూడెంట్ కాలేజీ లో స్టూడెంట్స్ అందరూ రెచ్చగొట్టి రచ్చ రచ్చ చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే వసు పై విరుచుకుపడతారు. అంతేకాకుండా ఎంతైనా వసు, రిషి సార్ పార్టీ కదా అని మాట్లాడుతాడు. ఆ మాటకు వసు ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. అయితే ఇదంతా కూడా దేవయాని ప్లాన్ ప్రకారం చేయిస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ వసు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా డౌన్డౌన్ అంటూ పెద్దగా అరుస్తూ ఉంటారు.

ఇంతలో అక్కడికి వచ్చిన రిషి, వసు ని స్టూడెంట్స్ మధ్యలో చూసి ఇదంతా వసుధార పని అని తప్పుగా అర్థం చేసుకుంటాడు. అప్పుడు వసు, రిషి కి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తుండగానే అక్కడినుంచి కోపంతో వెళ్ళిపోతాడు రిషి. కాలేజీలో ఈ రచ్చ జరగడానికి అసలు కారణం నువ్వే అని అంటాడు రిషి. ఇంతలో స్టూడెంట్స్ గోల గోల చేస్తుండగా నేను మీతో మళ్లీ మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel