Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Constable crying: భోజనం బాగాలేదని వలవలా ఏడ్చిన పోలీస్ కానిస్టేబుల్..!

Constable crying: ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో భోజనం ప్లేటు పట్టుకొని మరీ రోడ్డు మీదకు వచ్చాడు. గట్టి గట్టిగా ఏడుస్తూ… ఈ భోజనం చూడండి బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు చెప్పినా వినకుండా వలవలా ఏడ్చాడు. కానిస్టేబుల్ ఏడుపు చూసి కొందరు లోలోపలే నవ్వుకోగా, కొందరు ఏడవద్దంటూ సలహాలు ఇచ్చారు. అయితే పోలీస్ మెస్ లో భోజనం చాలా బాగుంటుందని, నాణ్యమైన ఆహారం పెడతారని అందరూ భావిస్తుంటారు కానీ అలా ... Read more

By Vinod Kumar

Published on: August 12, 2022 10:00 AM

Updated on: August 11, 2022 11:12 PM

---Advertisement---

Constable crying: ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో భోజనం ప్లేటు పట్టుకొని మరీ రోడ్డు మీదకు వచ్చాడు. గట్టి గట్టిగా ఏడుస్తూ… ఈ భోజనం చూడండి బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు చెప్పినా వినకుండా వలవలా ఏడ్చాడు. కానిస్టేబుల్ ఏడుపు చూసి కొందరు లోలోపలే నవ్వుకోగా, కొందరు ఏడవద్దంటూ సలహాలు ఇచ్చారు. అయితే పోలీస్ మెస్ లో భోజనం చాలా బాగుంటుందని, నాణ్యమైన ఆహారం పెడతారని అందరూ భావిస్తుంటారు కానీ అలా ఏం ఉండదని చెప్పాడు. ఈ భోజనం ఎంత దారుణంగా ఉందో చూడండంటూ ప్లేట్ ను రోడ్డుపై ఉన్న వారందరికీ చూపించాడు.

Advertisement

అలాగే భోజనం బాగా లేదన్న విషయాన్ని పైఅధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నాడు. అంతే కాదు ఇలా ఫిర్యాదులు చేస్తున్నందుకు తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని అధికారులు బెదిరింపులకు దిగుతున్నట్లు వివరించాడు. అదీగాక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కూడా రాష్ట్ర పోలీసులకు మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని చెప్పారని గుర్తు చేశాడు.

అయితే కానిస్టేబుల్ బోరుమని విలపించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ విషయమై ఫిరోజాబాద్ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి.. సదరు కానిస్టేబుల్ పై విధులకు హాజరు కాకపోవడం, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినందుకు గతంలో 15 సార్లు పనిష్మెంట్ పొందిన చరిత్ర ఉందని… చెప్పుకొచ్చారు. అయినా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అధికారులు వివరించారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.