Nuvvu Nenu Prema Serial : వంటలు పాడుచేసిన కుచల ప్లాన్ తెలివిగా తిప్పికొట్టిన పద్మావతి.. విక్రమాధిత్యను రెచ్చగొట్టిన కుచల..

Nuvvu Nenu Prema Serial Aug 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా కుచల పద్మావతి వంటలను పాడుచేస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. కుచల పద్మావతి వాళ్ళమీద అరుస్తుంటే అరవింద వాళ్ళ నానమ్మ అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది వాళ్లకు అర్థం కావట్లేదు పైగా నీ గోల ఏంటి నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి అంటుంది. ఇక పద్మావతి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అరవింద వాళ్లని బ్రతిమ లాడుతుంది. అప్పుడే అరవింద వాళ్ళ నానమ్మ సరే నేను కొంచెం సేపు గెస్ట్ లను ఆపుతాను మీరు ముందు ఆ పని చూడండి అంటూ అక్కడి నుండి వెళ్ళి పోతుంది.

Nuvvu Nenu Prema Serial Aug 20 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug 20 Today Episode

ఇక మాయ ఎలాగైనా మందు తాగాలని అక్కడ మందు కోసం వెతుకుతుంది. ఇక కుచల మాయ దగ్గరికి వెళ్లి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇక ఈ విషయం విక్కీకి తెలిస్తే వాళ్లని ఊరుకోడు అసలే విక్కీ కి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం. ఫంక్షన్ స్పాయిల్ అయినందుకు వాళ్లని క్షమించడు అంటుంది. ఇక మాయ కూడా సంతోషంతో పద్మావతి పీడ విరగడయి పోయినట్టే ఇక తనెప్పుడూ విక్కీ జోలికి రాదు ఇంట్లో అడుగుపెట్టదు అంటుంది. ఈ హ్యాపీ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఆంటీ రండి ఇద్దరం కలిసి మందు తాగుతాము అంటుంది. అప్పుడు కుచల నాకు అలవాటు లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ఒకపక్క పద్మావతి ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఇంత సేపు కష్టపడింది అంతా వృధా అయిపోయింది అంటుంది. అప్పుడు ప్రేమ్ సింగ్ వాళ్లకి దైర్యం చెబుతాడు. ఇక పద్మావతి కూడా నేను తలుచుకుంటే కానిది అంటూ ఏమి ఉండదు తగ్గేదెలా అంటూ వంటలను సరిచేస్తుంది. ఆర్య అక్కడికి వచ్చి ఏమైందండీ ఎందుకలా చేస్తున్నారు అంటాడు. అప్పుడు పద్మావతి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫుడ్ బాగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చాక ఫుడ్ పాడైపోయింది అంటుంది. ఇక ప్రేమ్ సింగ్ ఆర్యతో మీ అమ్మగారు అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా తిట్టారు అంటాడు. అప్పుడు ఆర్య మా అమ్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ సారీ చెప్తాడు. ఇక పద్మావతి వంటలన్నీ సరి చేసి వారిని టేస్ట్ చేయమని చెప్తుంది. అను మరియు ప్రేమ్ సింగ్ వంటలు టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అంటారు. ఇక ఆర్య నేను గెస్ట్ లను అందర్ని పిలుస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

Advertisement

Nuvvu Nenu Prema Serial Aug 20 Today Episode : పద్మావతి వంటలకు ఫిదా అయిన అతిథులు..   

కుచల విక్కీ ని పిలిచి ముందు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ నుండి ఆర్డర్ తెప్పించు అంటుంది. అప్పుడు విక్కీ ఎందుకు పిన్ని పద్మావతి వాళ్ళు వంట రెడీ చేసారు కదా ఆర్డర్ ఎందుకు అంటాడు. అప్పుడు కుచల వాళ్ళు చేసిన వంటలు సరిగా లేవు వంట మొత్తం స్పాయిల్ చేశారు. అవి వచ్చిన గెస్ట్ లకు పెడితే నీ పరువు పోతుంది అంటుంది. అరవింద మరియు అత్తయ్య వాళ్లనే సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వెళ్లి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించు అంటుంది. ఇక కోపంతో విక్కీ వాళ్ల దగ్గరికి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Serial Aug 20 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug 20 Today Episode

ఇక మురళి బయట నిల్చుని ఇంట్లో రాజులా ఉండేవాడిని.. ఇప్పుడు ఇలా నడిరోడ్డులో నిలబడాల్సి వచ్చింది. ఇదంతా నా వల్లే నేనే పద్మావతికి అనవసరంగా విక్కీ ఆఫీస్‌లో జాబు ఇప్పించాను. వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇక అరవింద పద్మావతికి సపోర్ట్ గా నిలిచింది. అందుకే తను ఇంట్లో అంత ఫ్రీగా ఉండగలుగుతుంది అనుకుంటాడు. ఇక కుచల మరియు విక్కీ వంటల దగ్గరికి వస్తారు. ఇక గెస్ట్ లందరూ భోజనం చేస్తుంటారు. అప్పుడు విక్కీ ఏంటి పిన్ని వంటలు బాలేదు అన్నావు మరి అందరు తింటున్నారుగా అంటాడు. అప్పుడు కుచల అక్కడికి వచ్చిన వారిని భోజనం ఎలా ఉంది అని అడుగుతుంది అప్పుడు వాళ్లు సూపర్‌గా ఉంది అంటారు. కుచల విక్కీ తో ఉండు నేను ట్రై చేస్తాను అని చెప్పి తను కూడా తింటుంది.

Nuvvu Nenu Prema Serial Aug 20 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug 20 Today Episode

విక్కీ ఎలా ఉన్నాయ్ అని అడగగానే బావున్నాయి అంటుంది. ఇక అక్కడికి వచ్చిన గెస్ట్ లు అందరూ విక్కీని పొగుడుతారు. ఇలాంటి రుచికరమైన ఇంటి భోజనం ఎప్పుడు తినలేదు మీరు ఏం చేసినా చాలా బాగా చేస్తారు అంటారు. కుచల తనే కోడలు అని బ్రమపడుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్లి మా అబ్బాయి ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు ఆమె మీ అబ్బాయి ఎవరు అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు పెళ్లయింది ఒక పాప కూడా ఉంది అంటుంది.

Advertisement

అప్పుడు కుచల ఆర్యని పిలిచి ఏంటి పిల్లను తెమ్మంటే పిల్లతల్లిని తీసుకొస్తావా అంటుంది. అప్పుడు ఆర్య అమ్మ నువ్వు పొరపాటు పడ్డావు తను కాదు అంటాడు. మరి నా కోడలు ఎక్కడ ఉందో చూపించు అంటుంది. అప్పుడు ఆర్య ఇప్పుడు అను నీ నేను అమ్మకు చూపిస్తే ఇక ఎప్పుడు తను మా ఇంటి కోడలు కాలేదు నేనే సందర్భం చూసుకుని చెబుతాను అనుకుంటూ తను లేదమ్మా వెళ్ళిపోయింది అంటాడు. ఇక రేపు ఏం జరుగబోతోందో చూడాలి.

Read Also : Nuvvu Nenu Prema Serial : వండిన వంటల్లో ఉప్పు, కారం కలిపిన కుంచల.. ప్లాన్ చేసి అను, పద్మావతిని బయటకి గెంటేసింది..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel