Naga chaithanya: సామ్ కంటే ముందు నాగ చైతన్యకు మరో లవర్ ఉండేదా.. నిజమేనా?

Naga chaithanya: ఏం మాయ చేశావే సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా చేసిన కొన్ని కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. తన మొదటి సినిమాలో కలిసి నటించి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై… ఆమెకు విడాకులు ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా తనకు కాలేజీ రోజుల్లోనే మరో లవ్ స్టోరీ ఉన్నట్లు కామెంట్లు చేశాడు. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. నాగ చైతన్య లేటెస్ట్ మూవీ థాంక్యూ విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కు భారీగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో ఓ సాండ్ విడుదల చేశారు.

ఆ కార్యక్రమంలోనే నాగ చైతన్య తన కళాశాల ప్రేమ గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు. కాలేజీ రోజుల్లో ఆ ఎంజాయ్.. అప్పటి ప్రేమ సంగతులు అంటూ ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అమ్మాయిలంతా అందంగా కనిపిస్తున్నారని చెబుతూ అక్కడి వాతావరణంలో హుషారు నింపారు. కాలేజీకి వచ్చిన ప్రతీ సారి తాను జెలస్ గా ఫీల్ అవుతానని.. అప్పటి రోజులే వేరంటూ కామెంట్లు చేశాడు. అయితే కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి, తన ప్రేమ విషయం ఎలా చెప్పాలనే ఆలోచనలు ఎప్పుడూ వెంటాడేవని చెప్పారు. దీంతో ఆయనకు సామ్ కంటే ముందే మరొకరితో ప్రేమాయణం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel