Mukku avinash comments: రూమ్ కు పిలిచి మరీ నాగబాబు వార్నింగ్ ఇచ్చాడట.. ముక్కు అవినాష్ కామెంట్స్ వైరల్!

Updated on: June 4, 2022

Mukku avinash comments: జబర్దస్త్ కమెడియన్లకు, నాగబాబుకు ఉన్న బంధం ఎవరూ విడదీయలేనిది. నాగబాబు వారి జీవితాలకు ఎప్పడూ సరైన మార్గ నిర్దేశం చేస్తుంటారని.. అలాగే తమ తండ్రి స్థానంలో ఉంటాడని సుధీర్, గెటప్ శ్రీను, ఆది లాంటి వాళ్లు చెబుతూనే ఉంటారు. ఇదిలా ఉండగా.. తన కామెడీ, మిమిక్రీతో పాపులారిటీ సంపాదించిన ముక్కు అవినాష్ ప్రస్తుతం పలు షోలు చేస్తున్నాడు. తన భార్యతో కలిసి జోడి షోలో కూడా పాల్గొన్నాడు. అటు కెరియర్ తో పాటు మ్యారేజ్ లైఫ్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన నాగబాబుపై పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.

జబర్దస్త్ ని వీడి మీరు వెళ్లడానికి కారణం నాగబాబు గారేనా అని యాంకర్ అవినాష్ ని ప్రశ్నించగా.. అలా ఏం లేదని.. తన కెరియర్ కోసమే తాను అక్కడి నుంచి వచ్చేసినట్లు చెప్పాడు. అలాగే ఎవరి లైఫ్ వాళ్లది. ఎవరి కోసం ఎవరూ నిర్ణయాలు తీస్కోరని వివరించాడు. కాకపోతే ఏది మంచి ఎది చెడు అనేది మాత్రం నాగబాబు గారు వివరించే వారని… ఏదైనా తప్పు చేస్తే.. రూమ్ కు పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చే వారన్నారు. తండ్రి స్థానంలో ఉండి మమ్మల్నందరినీ ఆయన గైడ్ చేసేవాంటూ తెలిపారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel