వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Janaki Kalaganaledu: మల్లిక ప్లాన్ సక్సెస్.. జ్ఞానాంబను అరెస్ట్ చేసిన పోలీసులు..

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి జానకి చదువుకుంటూ ఉండగా అప్పుడు రామచంద్ర జానకికి చెమట పట్టకుండా గాలి విసురుతూ ఉంటాడు. అలా ఇద్దరూ కొద్దిసేపు మూగసైగలతో రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు జానకి రామచంద్ర కోసం ఖర్జానాకు అన్నం తీసుకుని వెళుతుంది. ఆ తర్వాత రామచంద్ర కోసం తల్లి ... Read more

By Ramesh Babu

Published on: April 4, 2022 12:14 PM

Updated on: April 4, 2022 1:08 PM

---Advertisement---

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి జానకి చదువుకుంటూ ఉండగా అప్పుడు రామచంద్ర జానకికి చెమట పట్టకుండా గాలి విసురుతూ ఉంటాడు. అలా ఇద్దరూ కొద్దిసేపు మూగసైగలతో రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు జానకి రామచంద్ర కోసం ఖర్జానాకు అన్నం తీసుకుని వెళుతుంది.

ఆ తర్వాత రామచంద్ర కోసం తల్లి జ్ఞానాంబ కూడా అన్నం తీసుకుని వచ్చి తాను అన్నం తీసుకుని వచ్చాను అని చెప్పద్దు అని ఆ ఖార్జానా యజమాని తో చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో రామచంద్ర తన తల్లి తెచ్చిన భోజనం చేసి సూపర్ గా ఉంది అని జానకికి ఫోన్ చేసి మెచ్చుకుంటాడు.

వంట అచ్చం మా అమ్మ చేసిన అమృతం లోనే ఉంది అంటూ వంట గురించి పొగుడుతాడు. ఈ వంటలు తింటుంటే మా అమ్మ నాకు వడ్డీంచినట్లు అనిపిస్తోంది అని అనడంతో అది దూరం నుండి గమనించిన జ్ఞానాంబ ఆనంద పడుతుంది. జానకి చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అని జ్ఞానాంబ మనసులో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఆ తర్వాత పెద్ద వర్షం కురుస్తుండటంతో జానకి రామ చంద్ర ఇల్లు మొత్తం కారుతూ ఉంటుంది. ఆ వర్షానికి రామచంద్ర, జానకి లో ఎక్కడికి పోతారు. నీకేం లోని జానకిని మిమ్మల్ని ఎంత కష్ట పెడుతున్నాను అని రామచంద్ర అనగా అప్పుడు జానకి అయితే నాకు విడాకులు ఇచ్చేయండి నేను స్వతంత్రంగా బతుకుతాను అని అనడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.

ఆ తర్వాత కొద్ది సేపు రొమాంటిక్ గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అనంతరం జానకి, రామచంద్ర లు ఒకరి నొకరు హత్తుకుంటారు. మరొకవైపు జానకి కోసం తన అన్నయ్య వదినలు వస్తూ ఉంటారు. అయితే జానకి వాళ్ళ వదినను అన్నయ్య యోగ జ్ఞానాంబ ఇంటివద్దే విడిచి అతను మాత్రం పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఆ తర్వాత జ్ఞానాంబ ఇంటికి వచ్చి పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము అని చెప్పగా ఎందుకు అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.

అప్పుడు మల్లిక లోపల తెగ ఆనంద పడుతూ బయటికి మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తుంది. పోలీసులు మీ పెద్ద కోడలు జానకిని మీరు వేధిస్తున్నారని, మీ పై గృహహింస చట్టం కేసు కింద మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని పోలీసులు అంటారు. దీంతో ఒక్కసారిగా జ్ఞానాంబ కుటుంబం షాక్ అవుతారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel