వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral Video: బుడ్డ చెఫ్.. దోశని మామూలుగా తిప్పట్లేడుగా, చూడండి మీరే!

Viral Video: చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముద్దుగా అనిపిస్తుంది. బుడి బుడి అడుగులు వేసే దగ్గర నుండి వారి నోటి నుండి వచ్చే అచ్చీ రాని మాటలు చాలా నవ్వు తెప్పిస్తాయి. వారి అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఈ వీడియోలు చాలానే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బుడ్డోడి వీడియో ఒకటి చూస్తే చాలు.. ఇక అలాంటివే అన్నీ కనిపిస్తుంటాయి. అందులో ఆ పిల్లలు చేసే అల్లరి భలే నవ్వు ... Read more

By Vinod Kumar

Published on: August 28, 2022 12:00 PM

Updated on: August 28, 2022 11:40 AM

---Advertisement---

Viral Video: చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముద్దుగా అనిపిస్తుంది. బుడి బుడి అడుగులు వేసే దగ్గర నుండి వారి నోటి నుండి వచ్చే అచ్చీ రాని మాటలు చాలా నవ్వు తెప్పిస్తాయి. వారి అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఈ వీడియోలు చాలానే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బుడ్డోడి వీడియో ఒకటి చూస్తే చాలు.. ఇక అలాంటివే అన్నీ కనిపిస్తుంటాయి. అందులో ఆ పిల్లలు చేసే అల్లరి భలే నవ్వు తెప్పిస్తుంది. వారి అచ్చీ రానీ మాటలు బాగుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటిదే.

ఒక బుడ్డోడు తన తండ్రికి కిచెన్ నుండి దోశ తీసుకువచ్చి వడ్డిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చిన్న పిల్లాడు దోశ వడ్డిస్తేనే అంతగా వైరల్ కావడానికి ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by joshiik (@josh_iik)

జోషిక్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్ లో ఈ వీడియో పోస్టు చేయగా.. చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియోకు విపరీతమైన లైకులు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. అంతలా ఆ బుడ్డోడు ఏం చేశాడంటే.. ఆ పిల్లాడు.. దోశను తన తండ్రి ప్లేట్ లో వేస్తూ గరిటెతో తన తండ్రి ప్లేట్ లో దోశను తిప్పిన విధానం భలే ఉంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 16 మిలియన్ల మంది వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు ఆ పిల్లాడి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel