Karthika Deepam Dec 5 Today Episode : మోనితను అరెస్టు చేసిన పోలీసులు.. ఆనందంలో దీప, కార్తీక్..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత టెన్షన్ పడుతుంది.

ఈ రోజు ఎపిసోడ్ లో మోనిత ఇంటికి రావడంతో అప్పుడు శివలత మేడం వచ్చారా ఎక్కడికి వెళ్లారు ఏమయ్యింది ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అనగా అవన్నీ తర్వాత చెబుతాను ముందు మీ సార్ వచ్చారా, ఆ వంటలక్క వచ్చిందా అనగా లేదు మేడం అనడంతో వెంటనే మోనిత రారు ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు అని కోపంతో మాట్లాడుతుంది మోనిత. అప్పుడు శివలత వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో మేడం అని అనగా అక్కడ కూడా లేరు అని అంటుంది. ఆ తర్వాత శివలత ఫోన్ నుంచి కార్తీక్ ఫోన్ చేయగా ఫోన్ కట్ చేయడంతో మోనిత మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు ఎక్కడికి వెళ్లావు కార్తీక్ నాకు చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళిపోయే వాడివి కాదు. ఆ దీప నుంచి నిన్ను నేను రక్షించుకోవడం కోసం ఎన్ని అవస్థలు పడ్డాను నాకు తెలుసు కానీ ఇప్పుడు గతం గుర్తుకు వచ్చి నువ్వు ఆ దీపతో పాటు వెళ్లిపోయావు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది మోనిత. ఎలా అయినా సరె వాళ్ళు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని మోనిత లోపలికి వెళ్లి లగేజ్ చేతిలో గన్ను పట్టుకొని కోపంగా బయలుదేరగా అప్పుడు శివలత అడ్డు చెబుతుంది.

ఎక్కడికి వెళ్తున్నారు మేడం ఆవేశ పడకండి కొంచెం ఆలోచించండి అని అనగా నన్ను ఆపొద్దు శివలత ఈరోజు ఎలా అయినా ఆ దీపను చంపిన కార్తీక్ ని తెచ్చుకుంటాను అని కోపంగా బయలుదేరుతూ ఉండగా ఇంతలో అక్కడికే సౌందర్య వస్తుంది. నాకు తెలుసు మోనిత నువ్వు ఇక్కడికి వస్తావని అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను మళ్లీ ఎవరిని చంపడానికి వెళుతున్నావు అని సౌందర్య అడగగా ఎందుకు ఆంటీ నన్ను ఇలా వేధిస్తున్నారు ఎందుకు నా వెనకాలే పడుతున్నారు మీకేం పని లేదా అని అంటుంది మోనిత.

ఎవరిని చెప్పడానికి వెళ్తున్నావు అని సౌందర్య అడగడంతో వెంటనే మోనిత గన్ను తీసుకొని సౌందర్యకి గురిపెట్టి నిన్ను చంపడానికి మిమ్మల్ని చంపిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అంటుంది మోనిత. అప్పుడు సౌందర్య పక్కకు తప్పుకోవడంతో అక్కడ పోలీసు ఉండడం చూసి ఒక్కసారిగా మోనిత షాక్ అవుతుంది. పెరవలి మీద బయటకు వచ్చి రౌడీ వేషాలు వేస్తున్నావా నువ్వు డాక్టర్ చదువు చదివి ఈ బోటిక్ పెట్టుకోవడం ఏంటి ఏం జరుగుతోంది అని అనగా ఏం లేదు అనడంతో సౌందర్య లేదు ఈ మోనిత ఏదో నిజం దాస్తోంది నన్ను కూడా మొన్న పగలగొట్టింది పోలీస్ ఆశ్చర్య పోతుంది.

Advertisement

అప్పుడు పోలీస్ మోనిత చేతిలో ఉన్న గన్ను తీసుకొని ఈ ఒక్కటి చాలు నిన్ను పదేళ్లు లోపలికి వేయడానికి అనగా మోనిత షాక్ అవుతుంది. అప్పుడు సౌందర్య ఇలాంటి ఆడదాన్ని పదేళ్లు కాదు వందేళ్లు లోపల పెట్టాలి అని అనడంతో మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పోలీస్ కారు ఎక్కుతూ అప్పుడే ఏం జరగలేదు అని ఈ మోనిత ఇంకా బతికే ఉంది నీ సంగతి మళ్ళీ చూస్తాను అని సౌందర్య కు వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు కార్తీక్ దీపను ప్రేమగా నడిపించుకుంటూ వాకింగ్ చేయిస్తూ ఉంటాడు. అప్పుడు దీప కార్తీక్ ని చూసి సంతోషపడుతూ, సౌర్య గురించి ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

అప్పుడు కార్తీక్ నేను ఆ మోనిత దగ్గరికి వెళ్లి వస్తాను అని అనగా అప్పుడు దీప వద్దు డాక్టర్ బాబు మీరు వెళ్తే ఆ మౌనిక మిమ్మల్ని మళ్ళీ రానిస్తుందా అనడంతో నాకు గతం గుర్తుకు వచ్చింది అని చెబుతాను అప్పుడు నాతో అది ఉండదు కదా అని అనగా వద్దు నా మాట వినండి అనడంతో ఏం కాదు దీపా నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్లదు నేను ఇప్పుడే వస్తాను అని మోనిత దగ్గరికి బయలుదేరుతాడు కార్తీక్. మరొకవైపు సౌందర్య ఆనందరావు ఇద్దరు మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ దీప గురించి అడుగుతూ అసలు ఈ దీప ఎవరు డాక్టర్ బాబు ఎవరు అసలు ఏం జరుగుతోంది వీళ్ళు నిజంగానే భార్య భర్తల ఈ విషయాలన్నీ దీప ని అడిగి తెలుసుకోవాలి అని డాక్టర్ అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్ళగా అప్పుడు శివలత జరిగింది మొత్తం వివరించడంతో కార్తీక్ ఆశ్చర్యపోతాడు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel