Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

TS Police Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. పోలీస్ నియామకాలకు రెండేళ్లు వయోపరిమితి పెంచిన తెలంగాణ సర్కార్!

TS Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలని పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో కేసీఆర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ విషయంపై పునరాలోచన చేసిన కేసీఆర్ వెంటనే ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేశారు.

TS Police Jobs

అయితే ఇప్పటికే పోలీస్ నియామకాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణకు నేటి (మే 20)తో పూర్తి కానుంది. ఇలాంటి సమయంలో కెసిఆర్ వయోపరిమితి పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని రోజులపాటు దరఖాస్తు గడువు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.దరఖాస్తు గడువు పెంచకుండా వయోపరిమితి పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదని, నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు రెండు సంవత్సరాలపాటు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచుతుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే సుమారు నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధంగా రెండు సంవత్సరాల పాటు వయసు పెంచడంతో మరో నాలుగు లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.దరఖాస్తు గడువు పెంపు ఆదేశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఇలా నిరుద్యోగ అభ్యర్థుల వినతులను దృష్టిలోకి తీసుకొని రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read Also : TSPSC Group-1: గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

Exit mobile version