Karthika Deepam Dec 3 Today Episode : ఒకటైన డాక్టర్ బాబు, వంటలక్క.. కోపంతో రగిలిపోతున్న మోనిత?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తిక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప బైటికి వెళ్ళాలి అని మొండి పట్టు పడుతుంది.

ఈరోజు ఎపిసోడ్లో దీప నేను నా సౌర్యను వెతకడానికి వెళ్తాను అని మంచం పై నుండి వెళ్లడానికి ప్రయత్నించగా కార్తీక్ డాక్టర్ ఇద్దరూ అడ్డుపడతారు. అప్పుడు దీపా ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో వెంటనే ఆ డాక్టర్ షటాప్ దీప అప్పటినుంచి చూస్తున్నావ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు. ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నారో నీకు తెలుసా అని అసలు నిజం చెప్పబోతుండగా వెంటనే కార్తీక్ వద్దు అంటూ సైగ చేస్తాడు. అప్పుడు దీప ఎందుకు ఆయన నాకు ఏమైనా ఆపరేషన్ చేశారా అని అనగా ఆపు దీప అని అంటుంది ఆ డాక్టర్.

Advertisement

కూతురు కోసం వెళ్లమని చెబుతున్నావు మరి నేను ఇక్కడ ఇలా వదిలేసి ఎలా వెళ్తారు నీకు బాగోలేదని ఆయన ఎంత ఏడుస్తున్నాడో ఎంత తాపత్రయపడుతున్నాడో నీకు తెలుసా అని అంటుంది ఆ డాక్టర్. ఏమన్నావ్ నీకు ఆపరేషన్ చేశారా అన్నావు కదా నిజమే ఈ డాక్టర్ బాబు నీకు ఆపరేషన్ చేశారు అనడంతో అప్పుడు దీప సంతోషపడుతుంది. డాక్టర్ బాబు మీకు గతం గుర్తుకు వచ్చిందా అని అనడంతో అవును అని అంటాడు కార్తీక్. మరి ఎందుకు చెప్పలేదు అని దీప ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో అప్పుడు కార్తీక్ ఇంజక్షన్ వేసి పడుకోమని చెబుతాడు.

మరొకవైపు మోనిత ఎలా అయినా సౌందర్య రాకముందే ఇంట్లోంచి తప్పించుకొని వెళ్లిపోవాలి అని ఆనందుని తీసుకుని బయటకు వెళ్లాలి అనుకుంటుండగా అప్పుడు హిమ అడ్డుకుంటుంది. మోనిత అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ అనడంతో చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా అని అంటుంది మోనిత. నానమ్మ వచ్చాక వెల్లు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది మోనిత. మరొకవైపు మోనిత ని గతంలో అరెస్టు చేసిన పోలీసులు ఒక కానిస్టేబుల్ ఇద్దరూ మోనిత గురించి ఆలోచిస్తూ ఈ మోనిత ఎక్కడికి వెళ్ళింది..

బెయిల్ పై బయటకు వచ్చి ఎక్కడ తిరుగుతుంది అసలు కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కనే ఉన్న కానిస్టేబుల్ ని మళ్ళీ ఏమైనా మోనిత హెల్ప్ చేస్తున్నావా అనగా లేదు మేడం అప్పుడు చేశాను ఇప్పుడు ఎలా చేస్తానో మేడంతో సరే మోనిత గురించి కనుక్కోండి అని అంటుంది పోలీస్. మరొకవైపు మోనిత క్యాబ్ బుక్ చేసుకొని నీ కారుకు ఎంత స్పీడు ఉంటే అంత స్పీడ్ లో వెళ్ళు స్పీడ్ కీ వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను అని అంటుంది. మరొకవైపు మోనిత కనిపించడం లేదు అని సౌందర్య ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడు హిమ అసలు విషయం చెప్పడంతో సౌందర్య షాక్ అవుతుంది.

Advertisement

మరొకవైపు కార్తీక్ జ్యూస్ కలుపుతూ ఉండగా దీప కావాలనే పదేపదే డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని పిలుస్తూ నవ్వుతూ మీకు ఎప్పుడు గతం గుర్తుకు వచ్చింది అని అనగా సంగారెడ్డికి వెళ్ళినప్పుడు గుర్తుకు వచ్చింది దీప అని అంటాడు కార్తీక్. అప్పటినుంచి ఆ మోనిత కారణంగానే నీకు చెప్పకుండా దాచాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు మోనిత డ్రైవర్ని మరింత స్పీడ్ పెంచి తొందరగా వెళ్ళమని చెబుతుంది. ఆ తర్వాత ఇంద్రుడు దంపతులు మనం సౌర్య గురించి బాధపడుతూ ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్నలకు ఇవ్వకుండా చాలా తప్పు చేసాము అనుకుంటూ ఉంటారు.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel