Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

CM KCR : గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ తేనీటి విందు.. ఏం మాట్లాడారో తెలుసా?

CM KCR : దాదాపు 8 నెలల విరామం తర్వాత సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11వ తేదీన అక్కడికి సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం కోసం రాజ

By Vinod Kumar

Published on: June 28, 2022 3:30 PM

Updated on: June 28, 2022 4:35 PM

CM KCR met the governor at the cj swearing ceremony

---Advertisement---

CM KCR : దాదాపు 8 నెలల విరామం తర్వాత సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11వ తేదీన అక్కడికి సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం కోసం రాజ్ భవన్ వెళ్లిన కేసీఆర్… ఆ తర్వాత రాజ్ భవన్ వైపు వెళ్లలేదు. తాజాగా ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. చాలా కాలంగా గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ మధ్య విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని, కనీసం తల్లి మరణిస్తే కూడా సీఎం కేసీఆర్ పలకరించలేదని గవర్నర్ తమిళిసై గతంలో కామెంట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

CM KCR met the governor at the cj swearing ceremony
CM KCR met the governor at the cj swearing ceremony

తాజాగా సీజే ప్రమాణ స్వీకారం కోసం ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్, సీం ఒకరినొకరు పుష్పగుచ్ఛాలతో గౌరవించుకున్నారు. అయితే వారిద్దరి మధ్య సమావేశం సాఫీగా సాగిందని. సహృద్భావ వాతావరణంలోనే జరిగిందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత తేనీటి విందులోనూ ఇరువురూ సంతోషంగా ఉన్నారు.

Advertisement

Read Also : 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :