Viral Video : బెంగుళూరులో నడిరోడ్డుపై విచక్షణారహితంగా కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!

Updated on: January 24, 2023

Viral Video: ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోలేదనే మాటలోఎంతో నిజం ఉంది. అబ్బాయిలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలు అబ్బాయిలకు పోటీగా నడిరోడ్డుపై విచక్షణ రహితంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.ఇక గత కొద్ది రోజుల క్రితం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని బిషాప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు, మరో పాఠశాలకు చెందిన విద్యార్థులతో కలిసి విచక్షణారహితంగా రోడ్డుపై గొడవపడ్డారు.

bengaluru-school-girls-have-brawl-on-road-video-goes-viral
bengaluru-school-girls-have-brawl-on-road-video-goes-viral

ఈ గొడవలో భాగంగా అమ్మాయిలు ఒకరినొకరు జుట్టు పీక్కుంటూ కింద పడేసి కొట్టుకున్నారు. ఇలా ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్నప్పటికీ ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఈ విధంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ఈ దాడిలో భాగంగా పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ క్రమంలోనే ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడ కొందరు ఈ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ గొడవ పై ఇప్పటి వరకు స్కూల్ యాజమాన్యం లేదా పోలీసులు కూడా ఏమాత్రం స్పందించలేదు.

ఇలా స్కూల్ విద్యార్థులు నడిరోడ్డుపై విచక్షణ రహితంగా దాడి చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…ఈ గ్యాంగులో ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఈ రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు నడిరోడ్డుపై కొట్టుకోవడం సరికొత్త విధానానికి దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Read Also : Viral video: మహిళపై అటాక్ చేసిన నక్క.. మళ్లీ మళ్లీ దాడి, అంతలోనే!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel