Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

AP SSC Supplementary Exams : ఇవాళ్టి నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి వివరాలు

AP SSC Supplementary Exams 2022 : ఏపీలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలు మొదలుకానున్నాయి. జూలై 6 (బుధవారం) నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో (2021-22) పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, బెటర్‌మెంట్‌ పరీక్షలు జరుగనున్నాయి. జులై 6 నుంచి 15 వరకు ఈ పరీక్షలను ఉదయం 9 గంటల 30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 వరకు నిర్వహించనున్నారు. దాదాపు 986 ... Read more

By Vinod Kumar

Published on: July 6, 2022 9:45 AM

Updated on: July 6, 2022 9:45 AM

AP SSC Supplementary Exams to be Started from Today

---Advertisement---

AP SSC Supplementary Exams 2022 : ఏపీలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలు మొదలుకానున్నాయి. జూలై 6 (బుధవారం) నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో (2021-22) పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, బెటర్‌మెంట్‌ పరీక్షలు జరుగనున్నాయి. జులై 6 నుంచి 15 వరకు ఈ పరీక్షలను ఉదయం 9 గంటల 30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 వరకు నిర్వహించనున్నారు. దాదాపు 986 పరీక్ష కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు.

AP SSC Supplementary Exams to be Started from Today
AP SSC Supplementary Exams to be Started from Today

దాదాపు 2,01,627 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. అలాగే, 8,609 మంది విద్యార్ధులు బెటర్‌మెంట్ పరీక్షలు రాయనున్నారు. సప్లిమెంటరీకి సంబంధించి 90,334 మంది బాలికలు కానున్నారు. 1,16,826 మంది బాలురు ఉన్నారు.

Advertisement

బెటర్‌మెంట్ రాసేవారిలో బాలురు 4,737 మంది, బాలికలు 3,872 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష సమయం మించితే ఎవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. కోవిడ్‌ నిబంధనలు విధిగా పాటించాలని, హాల్‌ టికెట్లతో పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.

Read Also : Goutham Raju : టాలీవుడ్‌లో విషాదం.. సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు కన్నుమూత

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.