Anchor omkar: ఓంకార్ పై ఆట సందీప్ భార్య ఘాటు వ్యాఖ్యలు.. మీకు మీ తమ్ముళ్లు గుర్తున్నారా లేదా!

Updated on: July 26, 2022

Anchor omkar: ఇస్మార్ట్ జోడి, ఆట, మాయాద్వీపం, సిక్త్స్ సెన్స్ ఇలా తను చేసేషోలకు ఓన్ కంటెంట్ తో త మార్క్ చూపిస్తుంటారు యాంకర్ ఓంకార్. యాంకర్ గా, డైరెక్టర్ గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆట అనే డ్యాన్స్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఓంకార్ పై ఆట సందీప్ సతీమణి జ్యోతి రావ్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. కొరియాగ్రాఫర్ ఆట సందీప్, ఆయన జ్యోతి రాజ్ సోషల్ మీడియాలో వేసే స్టెప్పులు ఎంతలా వైరల్ అవుతుంటాయో అందరికీ విదితమే. వీరిద్దరూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆట ప్రోగ్రామ్ నిర్వహించిన ఓంకార్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా జ్యోతి రాజ్ మాట్లాడుతూ… ఓంకార్ పై పలు షాకింగ్ కామెంట్లు చేశారు.

ఓంకార్ ను ఉద్దేశిస్తూ… మీ తమ్ముళ్లందరూ మీరు చెక్కిన శిల్పాలు కదా.. మీరు చెక్కిన డైమండ్స్ కదా.. మరి మీరు పెద్ద సినిమాలు చేసినప్పుడు మీ ఒక్కొక్క డైమండ్ కి అవకాశం ఇవ్వొచ్చు కదా.. మీరు కూడా పెద్ద మాస్ట్ర్స్ పబ్లిసిటీని ఎందుకు వాడుకుంటున్నారు.. మీ తమ్ముళ్లని మీరే సపోర్ట్ చేయనప్పుడు బయటి వాళ్లు ఎలా సపోర్ట్ చేస్తారు.. ఇక్కడ నేను సందీప్ ను ఉద్దేశించి మాట్లాడడం లేదు… తను ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నాడంటూ జ్యోతిరాజ్ కామెంట్లు చేసింది. ఆటలో చేసిన ఒక్క కొరియోగ్రాఫర్ కైనా లైఫ్ ఉందా. ఎంతో మంది బయట అవకాశాలు ఈవెంట్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఓ పొజిషన్ కి వెళ్లి పడిపోయారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel