Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Amazon Prime : అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్… కానీ వారికి మాత్రమే !

amazon-offer-on-prime-membership-for-youngsters

amazon-offer-on-prime-membership-for-youngsters

Amazon Prime : ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై ఏకంగా 50 శాతం తగ్గింపును అందించనుంది ఈ సంస్థ. కాకపోతే ఈ ఆఫర్‌ కేవలం 18 – 24 ఏళ్ల లోపు యువకులకు మాత్రమే వర్తించనుంది. అలానే వారు పాత కస్టమర్లై ఉండాలి. గత ఏడాది ప్రైమ్‌ సేవల ధరలను పెంచుతూ అమెజాన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు యువతను లక్ష్యంగా చేసుకొని​ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై రెఫరల్స్ ప్రోగ్రామ్‌ను అమెజాన్‌ ప్రారంభించింది. ఈ ‘యూత్ ఆఫర్’ రెఫరల్స్‌ ప్రోగ్రాంలో భాగంగా సదరు యూజరు ప్రైమ్‌లో చేరినట్లయితే సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు రానుంది.

యూత్‌ ఆఫర్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ నెలవారీ రూ. 179 సభ్యత్వంపై రూ. 90 క్యాష్‌బ్యాక్‌తో పాటు మరో రూ. 18 క్యాష్‌బ్యాక్‌ను రిఫరల్ రివార్డ్‌గా ఆయా యూజర్‌ పొందవచ్చు. త్రైమాసిక సభ్యత్వంపై రూ. 479 సభ్యత్వంపై రూ. 230 క్యాష్‌బ్యాక్‌తో పాటు మరో రూ. 46 క్యాష్‌బ్యాక్‌ను రిఫరల్ రివార్డ్‌గా ఆయా యూజర్‌ పొందవచ్చు. వార్షిక సభ్యత్వంపై రూ. 1,499పై ఆయా యూజర్‌ రూ. 750 క్యాష్‌బ్యాక్‌తో పాటుగా మరో వ్యక్తికి రెఫరల్‌ చేసినందుకుగాను మరో రూ. 150 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్‌ అందిస్తోంది.

amazon-offer-on-prime-membership-for-youngsters

అమెజాన్‌ అందిస్తోన్న యూత్‌ ఆఫర్‌ను సదరు వ్యక్తి ఆయా యూజర్‌కు రెఫరల్‌ చేయడంతో 50 శాతం తగ్గింపును పొందవచ్చు.

Advertisement

సదరు యూజర్‌ ఖచ్చితంగా తన వయసును నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం సెల్ఫీ, తదితర వయసు ధృవీకరణ పత్రాలను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ ‘అమెజాన్‌ పే’లో క్రెడిట్‌ అవుతుంది.

Read Also : Sarkaru Vari Pata : మహేష్ బాబు ” సర్కారు వారి పాట ” లోని కళావతి కోసం ఎంత ఖర్చు పెట్టారంటే ..!

Advertisement
Exit mobile version