వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Petrol rate hike: లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయలు పెంపు.. ఎక్కడో తెలుసా?

అసలే ఆక్థిక వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న పాకిస్థన్ ప్రజలకు మరో సమస్య వచ్చి పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఆయిల్​ అండ్​ గ్యాస్​ అథారిటీ సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని షెహబాజ్​ షరీఫ్​ ప్రభుత్వం ప్రటించింది. ఇందులో భాగంగానే లీటరు పెట్రోల్​పై రూ. 83.5, డీజిల్​పై రూ.119 పెరిగే అవకాశం ఉందని సమాచారం. అంతే కాకుండా లైట్​ డీజిల్​పైన ... Read more

By Vinod Kumar

Published on: April 15, 2022 4:29 PM

Updated on: April 15, 2022 4:29 PM

---Advertisement---

అసలే ఆక్థిక వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న పాకిస్థన్ ప్రజలకు మరో సమస్య వచ్చి పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఆయిల్​ అండ్​ గ్యాస్​ అథారిటీ సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని షెహబాజ్​ షరీఫ్​ ప్రభుత్వం ప్రటించింది. ఇందులో భాగంగానే లీటరు పెట్రోల్​పై రూ. 83.5, డీజిల్​పై రూ.119 పెరిగే అవకాశం ఉందని సమాచారం.

అంతే కాకుండా లైట్​ డీజిల్​పైన రూ.77.31, కిరోసిన్​పైన రూ.36.5 పెంచాలని భావిస్తోంది పాక్​ ప్రభుత్వం. ఈ ధరలు అమలైతే పాక్​ ప్రజలకు ఇంధనం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్​లో పెట్రోల్​, డీజిల్​పై 17 శాతం జీఎస్​టీ వసూలు చేస్తుండగా దీనిని 70 శాతానికి పెంచాలని ఓజీఆర్​ఏ ప్రతి పాదించింది. ఈ ధరలపై ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ధరలే కనుక అమలు అయితే పాకిస్థాన్ ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel