Gauva Leaves : జుట్టు నల్లగా, పొడుగ్గా కావాలంటే ఈ ఆకులు వాడాల్సిందే..!

Updated on: April 25, 2022

Gauva leaves : ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోవడం.. జుట్టు నలబడడం వంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లలోనే జుట్టంతా తెల్లగా మారిపోతుంది. అయతే జుట్టు త్వరగా రాలడానికి తలలో ఉండే చర్మంలో ముఖ్యంగా ఆ లోపలి పొరలో ఉండే కొలాజెన్ దెబ్బతినడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. కొలాజెన్ దెబ్బతినడం వల్ల జుట్టు కుదుళ్ల బలహీనంగా మారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు కుదుళల్లో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు. ఈ సమస్యను తగ్గించడంలో జామ ఆకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. జామ ఆకులో ఉండే విటామిన్ సి, కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఈ రెండింటి కలయిక వల్ల జుట్టు కుదుళ్లలో కొలాజిన్ ప్రొడక్షన్ బాగా పెరిగి జుట్టు కుదుళ్లను బలంగా మార్చుతాయి.

Gauva Leaves
Gauva Leaves

అంతే కాకుండా జామ ఆకులో ఉండే లైకోపిన్ అన కెమికల్ కాంపౌండ్ ఎండ యొక్క యు.వి కిరణాల నుంచి జుట్టును రక్షించడానికి సాయపడుతుంది. దీని కోసం జామ ఆకులను మొత్తని పేస్టుగా చేసి రసం తీయాలి. ఈ రసాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తనస్నానం చేయాలి. వారంలో ఇలా రెండు సార్లు చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా బలంగా తయారై పొడవుగా పెరుగుతుంది.

Read Also :Hair Growth: పొడవైన అందమైన జుట్టు కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే సహజసిద్ధమైన హెయిర్ కండీషనర్ ఉపయోగించాల్సిందే!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel