Samantha: సమంతను వాళ్లు నిజంగానే అంత ఘోరంగా అవమానించారా..?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి వరసు సినిమాలు చేస్తూ… తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటుంది. సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే తెలుగులోనే కాకుండా తమిళ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకూ ఓకే చెప్తోంది. ఈ క్రమంలోనే కాస్త బోల్డ్ పాత్రల్లో నటించేందుకు కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. చైతూతో విడాకుల తర్వాతే ఆమె బన్నీ పక్కన పుష్ప సినిమాలో ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అనే ఐటం సాంగ్ లో నటించింది.

అసలు ఈ ఐటెం సాంగ్ లో కనిపించిన సమంత హాట్ నెస్ చూసి తెలుగు ప్రజలు ముక్కున వేలేస్కున్నారు. పాత్ర ప్రయారిటీతో పాటు ఆమె హద్దులు దాటే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని పుష్ప ఐటెం సాంగ్ తో చెప్పకనే చెప్పింది. పుష్ప బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా న్చింది. అక్కడే ఈ సినిమాకు వంద కోట్లు వచ్చాయి. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నా.. ఆమె రెండో హీరోయిన్ పాత్రలతో పాటు ప్రాధాన్యం పాత్రలు ఇవ్వడంతో ఆమె డిసపాయింట్ అయినట్లు తెలుస్తోంది. అందుకే బాలీవుడ్ ను కొన్నాళ్లు పక్కన పెట్టి విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel