Rajagopal reddy: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ బ్రాండ్ అని ఫైర్ అయ్యారు. ఎంతమంది వ్యాపారులను బెదిరించారో అందిరికీ తెలుసన్నారు. పీసీసీ పదవిని డబ్బులతో కొన్నాడని దుయ్యబట్టారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రేవంత్ జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. తాను రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వమని ఎక్కడైనా చెప్పినట్టుగా రుజువు చేస్తామని అని ప్రశ్నించారు.
ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు అంటూ రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే మునుగోడులో బట్టలు విప్పి కొడతారని.. తన కోసం ప్రాణం ఇచ్చే ప్రజలు ఉన్నారని రాజగోపాల్ చెప్పారు. పీసీసీ అయ్యాక రేవంత్ రెడ్డి ఇంటికి వస్తానని అడిగితే వద్దంటే వద్దని చెప్పానని గుర్తు చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి ఇంటికి మలినం అవుతుందనే వద్దని అన్న అని రాజగోపాల్ తెలిపారు.