Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Holi Festival: హోలీ పండుగ ఎప్పుడు… హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు?

Holi Festival: మన భారతదేశంలో జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. హోలీ పండుగను ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో పౌర్ణమి ముందు జరుపుకుంటారు. ఇలా ప్రతి ఏడాది హోలీ పండుగన

By Ramesh Babu

Published on: March 15, 2022 7:47 AM

Updated on: March 15, 2022 7:47 AM

---Advertisement---

Holi Festival: మన భారతదేశంలో జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. హోలీ పండుగను ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో పౌర్ణమి ముందు జరుపుకుంటారు. ఇలా ప్రతి ఏడాది హోలీ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. పూర్వకాలంలో హోలీ పండుగ రోజు అందరూ రంగు రంగు పుష్పాలను ఒకరిపై మరొకరు చల్లుతూ ఈ పండుగను జరుపుకునేవారు. అయితే ప్రస్తుతం ఈ పండుగను రంగులతో, రంగు నీటితో జరుపుకుంటున్నారు. అయితే హోలీ పండుగ ఇలా జరుపుకోవడానికి వెనుక కారణం ఏమిటి ఈ పండుగ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం…

pjimage 2022 03 15T074805.539పురాణాల ప్రకారం హోలీ పండుగను సత్య యుగం నాటి నుంచి జరుపుకున్నట్లు తెలుస్తోంది. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అనే విషయం మనకు తెలిసిందే. అది నచ్చని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో మార్గాలు వేతుకుతాడు. ఇలా తనని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన విష్ణు మాయ వల్ల ప్రహ్లాదుడు బతుకుతాడు. ఇక హిరణ్యకశిపుడు చివరికి తన సోదరి హోలిక సహాయంతో ప్రహ్లాదుడిని చితిమంటలలో వేయాలని భావిస్తాడు.

Advertisement

ఈ విధంగా హోలిక ప్రహ్లాదుడు తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నికి ఆహుతి అవుతుంది. విష్ణుదేవుడి మాయవల్ల ప్రహ్లాదుడు ఆ మంట నుంచి బయట పడగా హోలిక మాత్రం అగ్నిలో ఆహుతి అవుతుంది. ఇలా అప్పటి నుంచి పెద్ద ఎత్తున హోలీ పండుగను జరుపుకోవడం మొదలుపెట్టారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ హోలీ పండుగ రోజు సాయంత్రం హోళికా దహనం చేస్తారు. ఇక ఈ ఏడాది ఈ పండుగ మార్చి 18వ తేదీ వచ్చింది.పూర్వం హోలీ పండుగ రోజు ప్రతి ఒక్కరు రంగు పుష్పాలను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఈ పండుగను జరుపుకునేవారు. ఇలా చేయడం వల్ల అందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.