Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Health Tips : వేసవి కాలంలో రాగి అంబలితో కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Health Tips : మారుతున్న జీవన శైలితో పాటు, ఆహారపు అలవాట్లను కూడా క్రమేపీ మార్చుకుంటూ వచ్చారు. అలాంటి వాటిలో ఒకటే రాగి అంబలి త్రాగడం. చద్ది అన్నం తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు తిరిగి అనేకమంది ఈ పద్ధతులను అలవరచుకుంటున్నారు. వేసవి లో కలిగే వేడిని తట్టుకోవడానికి పాత కాలంలో రాగి అంబలి ఎక్కువగా సేవించేవారు. దీనినీ తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Health Tips

రాగి అంబలి ని తయారు చేసుకునే విధానం:
రాగులను తీసుకొని వాటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఒక వస్త్రం తీసుకొని వాటిని వేసి తిరిగి కొన్ని గంటలు, మొలకలు వచ్చేవరకు పెట్టాలి. వాటిని బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఆ పొడిని కొంత నీటిలో వేసి ఉడకపెడితే జావ తయారవుతుంది. ఈ మిశ్రమంలో జీడి పప్పు, కిస్మిస్, తేనె, పల్లీలు వంటివి వేసుకుని తాగవచ్చు. లేదా కాస్త ఉప్పు, కారం వేసుకున్న కూడా అంబలి రెఢీ అవుతుంది.

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Advertisement
Exit mobile version