G
Telugu News » Health News » green tea lovers must know the side effects green tea
⚡ Health News, Latest, Topstory

Green Tea Side Effects : గ్రీన్ టీ ఎక్కువగా తాగేస్తున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Green Tea Side Effects : గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గిపోతారని.. చాలా మంది ఎక్కువగా తాగేస్తుంటారు. గ్రీన్ టీ బరువు తగ్గిస్తుందనేది నిజమే అయినప్పటికీ... ఎక్కువ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Green Tea Side Effects : గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గిపోతారని.. చాలా మంది ఎక్కువగా తాగేస్తుంటారు. గ్రీన్ టీ బరువు తగ్గిస్తుందనేది నిజమే అయినప్పటికీ… ఎక్కువగా తాగకూడదు. రోజుకు రెండు, మూడు కప్పులు తాగితే ఫరవాలేదు కానీ అంతకు మించి తాగితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. అయితే ఆ దుష్ప్రభావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియ సమస్య… అసలైన టానిన్ మూలకం గ్రీన్ టీలో ఉంటుంది.

Green Tea

ఇది కడుపులో ఎసిడిటీ సమస్యను పెంచుతుంది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. తలనొప్పి.. రోజుకు రెండు నుండి మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే తలనొప్పి సమస్య తగ్గుతుంది. కానీ ఎక్కువగా గ్రీన్ టీని తీసుకుంటే అది మైగ్రేన్ సమస్యను పెంచుతుంది. నిద్ర లేకపోవడం.. గ్రీన్ టీలో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగితే నిద్ర విధానంలో సమస్య ఉంటుంది. ఇది మెలటోనిన్ హార్మోన్ లో అసమతుల్యతను కల్గిస్తుంది. ఇది నిద్ర సమస్యలకు దారి తీస్తుంది. అలాగే రక్తహీనత, వాంతులు అవుతుంటాయి. అందుకే ఎక్కువగా గ్రీన్ టీ ని తాగకండి.

Read Also : 

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷green effectsgreen tea importancegreen tea side effectsuses of green tea
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు