Health Tips:వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యల నుండి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో సబ్జా గింజలు ఉపయోగపడతాయి. సబ్జా గింజలు చూడటానికి చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుండి మన శరీరానికి కాపాడుతాయి. సబ్జా గింజలు ఏ విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శారీరక శ్రమ చేసేవారు,క్రీడాకారులు ప్రతిరోజు సబ్జా గింజలను రాత్రిపూట నానబెట్టి ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల వారికి కావాల్సిన శక్తి లభించి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి. ఈ గింజలలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది.సబ్జా గింజలలో ఉన్న ఆల్ఫాలినోలిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గిస్తుంది.
సబ్జా గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో కొంచం తేనె, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని ప్రతి రోజు తాగడం వల్ల బిపి, గుండె సంబంధిత సమస్యలు నుండి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు ఈ నీటిని తాగటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.