Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Beet Root : బీట్ రూట్… మీ అందానికి , ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!

beet-root-health-benefits-and-tipsw-for-beauty-and-health

beet-root-health-benefits-and-tipsw-for-beauty-and-health

Beet Root Benefits : బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపకరిస్తుంది. బీట్ రూట్ లో ఇనుము అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల రక్తహీనత సమస్య తగ్గించుకోవచ్చు. దీన్ని రోజు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేయటంతో పాటు రక్తపోటును తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలో తోడ్పడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. అలానే జీర్ణక్రియలను వేగవంతం చేస్తాయి. విటమిన్‌ బి దండిగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.

బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. క్రీడాకారులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.

ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన బియ్యం, నాలుగైదు బీట్ రూట్ ముక్కల్ని కలిపి మెత్తగా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కొద్దిగా పాలు కలిపి దాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. ఐదు నిమిషాల తరువాత పాలతో ముఖాన్ని మృధువుగా మర్ధన చేయాలి. పదినిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో కడుగితే ముఖ చర్మం కాంతి వంతంగా మారుతుంది. బీట్ రూట్ లోని సిలికాన్ ఖనిజం చర్మాన్ని తాజాగా కనిపించటానికి దోహదపడుతుంది.

Advertisement
beet-root-health-benefits-and-tipsw-for-beauty-and-health

బీట్ రూట్ రసానికి చెంచా బాదం నూనె, ఒక చుక్క తేనె కలిపి పెదాలకు పూతలా వేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే నల్లగా మారిన పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి. మృత కణాలు తొలగిపోవాలంటే బీట్ రూట్ గుజ్జుగా చేసి దానికి చిటికెడు పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై రుద్దాలి. ఇలా చేయటం వల్ల పెదాలు మృధువుగా ఉంటాయి.

రసాయనాలు కలిపిన రంగులు జట్టుకి వేయటం వల్ల హాని కలుగుతుంది. అయితే బీట్ రూట్ రసాన్ని తలపై రాసుకుని రెండు గంటలపాటు ఆరనిస్తే సహజసిద్ధమైన ఢై వేసుకున్నట్లే. అలాగే హెన్నాలో కాస్త బీట్ రూట్ రసాన్ని కలుపు కుంటే జట్టుకు మంచి రంగు వస్తుంది.

Read Also : Karthika Deepam : ఆపరేషన్ జరిగిన పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నా మోనిత!

Advertisement
Exit mobile version