Singer Prafulla kar passed away: లెజండరీ సింగర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

లెజెండరీ సింగర్​, మ్యూజిక్​ డైరెక్టర్​ ప్రఫుల్లా కార్ ​(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తన నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెలో నొప్పి వచ్చిందని ఆ తర్వాత కాసేపటికే ఆయన​ మరణించారని పేర్కొన్నారు. కార్​కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అయితే కార్ మృతి పట్ల పలువురు రాజకీయ సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒడిశా గవర్నర్​ గనేషి లాల్​, ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ సహా పలువురు సినీరాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పురిలోని స్వర్గ ద్వారా శ్మశాన వాటిక​లో ప్రభుత్వ లాంఛనలాతో కార్​ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చిత్ర సీమకు ఆయన అందించిన సేవలకుగానూ 2015లో ప్రభుత్వం ప్రద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. 2004లో జయదేవ అవార్డు కూడా వరించింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel