RRR Dosti Video : ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజ్ విదేశాల్లోనూ పెరిగిపోయింది. దేశ విదేశాల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ హీరోలకు అందరూ సలాం కొడుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ కనిపిస్తే చాలు.. ఫుల్ హంగామా చేసేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్.
ఎన్టీఆర్ (Jr Ntr), రామ్ చరణ్ (Ram Charan)లకు విదేశాల్లో ఫ్యాన్ బేస్ భారీగా పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. రాజమౌళి (Rajamouli) లేకుంటే వీరిద్దరూ లేరనడంలో సందేహం అక్కర్లేదు. రాజమౌళితో కలిసి పనిచేసిన చాలామంది హీరోల్లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారు.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. RRR మూవీ జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైంది. విడుదలైంది. ఈ మూవై ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా జపాన్‌కు వెళ్లారు. అక్కడి వీధుల్లో ఆర్ఆర్ఆర్ స్టార్లు ఫుల్ ఎంజాయ్ చేశారు.
జపాన్ వీధుల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సతీసమేతంగా దోస్తీ వీడియోను షేర్ చేశారు. రోజా పువ్వులతో ఒకరి చేతిలో ఒకరు చేయి పట్టుకుని జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తూ RRR దోస్తీ సాంగ్ యాడ్ చేశారు. ఆ పాటకు తగినట్టుగా డాన్స్ చేస్తూ జపాన్ వీధుల్లో సందడి చేశారు. ఈ వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
Read Also : Jana Gana Mana Movie : పూరి ‘జనగణమన’ అటకెక్కడానికి మహేష్ బాబు శాపమే కారణమా?!