G
Telugu News » Entertainment » ram gopal varma comments on kgf chapter 2
⚡ Entertainment, Latest

Kgf2 movie: కేజీఎఫ్-2 మూవీపై ఆర్జీవీ హాట్ కామెంట్స్

యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మూవీ కేజీఎఫ్-2. కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్టు కావడంతో సాధారణంగానే రెండో పార్ట్ పై అంచనాలు పెరు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మూవీ కేజీఎఫ్-2. కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్టు కావడంతో సాధారణంగానే రెండో పార్ట్ పై అంచనాలు పెరుగుతాయి. అలాగే కేజీఎఫ్ ఛాప్టర్-2 పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రెండో పార్ట్ లో రాకీ చేసే సాహసాలు, గోల్డ్ మైన్స్ సొంతం చేసుకోవడం గురించి అందరిలో ఎక్సైట్ మెంట్ నెలకొంది. మధర్ సెంటిమెంట్, హీరో ఎలివేషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్,.. కేజీఎఫ్-2లో ఎన్నో అంశాలు ప్రేక్షకుల్ని ఆకర్షించేలా ఉన్నాయని సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో కేజీఎఫ్్-2 లో ఎన్నో అంశాలు ప్రేక్షకుల్ని ఆకర్షంచేలా ఉన్నాయని సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేజీఎఫ్-2 ఓపెనింగ్ కలెక్షన్స్ పై తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

 

బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల జాబితా ఫోటోని షేర్ చేస్తూ.. బాలీవుడ్ మార్కెట్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో కన్నడ చిత్రమైన కేజీఎఫ్-2 తెలుగు చిత్రమైన బాహుబలి-2 తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీనిపై బాలీవుడ్ ఏం ఆలోచిస్తుందని మీరు భావిస్తున్నారు అని వర్మ ట్వీట్ చేశారు. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు అంతటా వైరల్ గా మారింది. మరో వైపు దక్షిణాది చిత్రాలకు ఇప్పుడు నార్త్ లోనూ మంచి మార్కెట్ లభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకూ తెలుగు చిత్రాలు హిందీలోనూ విడుదల అవుతున్నాయి.

Advertisement

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷kgf 2kgf chapter 2Ram Gopal VarmaRGV
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు