Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ram Charan : రామ్ చరణ్ -శంకర్ మూవీ టైటిల్ ఇదేనట..? మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. రెండు డిఫరెంట్ రోల్స్‌లో చెర్రీ..!

Ram Charan : Mega Power Star Ram Charan and Director Shankar movie latest update

Ram Charan : Mega Power Star Ram Charan and Director Shankar movie latest update

Ram Charan : మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ శంకర్ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో క్లారిటీ లేదు. అయినప్పటికీ టాలీవుడ్‌లో రామ్ చరణ్ శంకర్ మూవీ టైటిల్ ఇదేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం RRR మూవీ కంప్లీట్ చేసిన రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో కొత్త మూవీ చేయనున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీతో చాలా ఏళ్లు బిజీగా గడిపేశారు. ఇప్పుడు మళ్లీ సోలోగా తన మూవీ కోసం రెడీ అవుతున్నాడు.

Ram Charan : Mega Power Star Ram Charan and Director Shankar movie latest update

తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చేసిన రామ్ చరణ్.. ఇప్పటికే శంకర్‌తో మూవీకి రెడీ అయ్యాడు. ఇదివరకే హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. ఎస్ జె సూర్య, శ్రీకాంత్ విలన్లుగా చేయనున్నారని టాక్. సోషియో పొలిటికల్ డ్రామాగా శంకర్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు.

Advertisement

ఈ మూవీలో చరణ్ రెండు డిఫరెంట్ వేరియషన్స్ రోల్స్ కనిపించనున్నాడట.. ఇంతకీ చరణ్, శంకర్ మూవీ కొత్త టైటిల్ ‘సర్కారోడు’.. ఇదేనని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే మరి..

Read Also : Horoscope Today 10 March 2022 : ఈ రోజు ఈ రాశివారికి గడ్డుకాలమే.. ఏయే రాశులతో ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే?

Advertisement
Exit mobile version