Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

pawan kalyan : కోట్లు ఖర్చు చేసి ఫామ్ హౌస్ నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ కారణం ఏమై ఉంటుంది అబ్బా!

pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారంటూ ఉండరు. అతని కోసం ప్రాణాలు సైతం ఇచ్చే అభిమానులను మూట కట్టుకున్నాడు. తను చేసే మంచి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దగా డబ్బు మీద ఆశ చూపించన వ్యక్తి మన పవర్ స్టార్. ఎప్పుడు జనాలకి ఎలా సేవ చేయాలి అన్నది ఆయన ధ్యేయం. ఈ మధ్యన జనసేన అనే కొత్త పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేసే దిశగా ముందుకు వెళుతున్నారు. ఇక ఆయన 160 కోట్లు ఖర్చు చేసి ఒక ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడు అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం.

pawan kalyan is building a farm house with all the money the reason

పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ షెడ్యూల్, రాజకీయ కార్యక్రమాలు లాంటివి లేనప్పుడు ప్రశాంతత కోసం అతను ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటాడు. వ్యవసాయం పశుపోషణ వంటి అతనికి ఎంతో ఇష్టమైన పనులు ఇక వీటి కోసం గండిపేట -చిలుకూరు మధ్య విస్తరించి ఉన్న ప్రాంతంలో 16 ఎకరాల ల్యాండ్ ని కొనుగోలు చేశాడు. అక్కడే పశుపోషణ, వ్యవసాయం వంటి పనులు చూసుకుంటాడు. ముఖ్యంగా మొక్కలకు నీళ్లు పోయడం, ఎరువులు, పశువులకు మేత లాంటివి తానే స్వయంగా చూసుకుంటాడు. ఇక తన ఫామ్ హౌస్ పండిన ఆర్గానిక్ పండ్లను తనకు ఇష్టమైన వారికి పంపిస్తాడు.

అయితే ప్రస్తుతం ఉన్న ఫాంహౌస్ చిన్నది కావడంతో దాన్ని కూల్చివేసి పెద్దదిగా కట్టిస్తున్నట్లు సమాచారం. అంతే కాదు కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక తను హైదరాబాద్ శివారులో కొన్న 16 ఎకరాల భూమి ఒక్క ఎకరం 10 కోట్లు వాల్యు పలుకుతుంది. ఇక ఆ ల్యాండ్ మొత్తం 160 కోట్లు అని చెప్పవచ్చు. ఇక అంత వ్యాల్యూ పలుకుతున్న భూమిని తన లగ్జరీ అవసరాలకు ఉపయోగించుకోకుండా ఈ విధంగా వ్యవసాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ఈ విషయం పవర్ స్టార్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు చాలా మంచి జరుగుతుందని పవర్ స్టార్ అభిమానుల అభిప్రాయం. ఇక ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఫామ్ హౌస్ నిర్మించడం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Read Also : Jabardasth New Anchor : జబర్దస్త్‌లోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. పల్లకిలో వచ్చిన ఆ గ్లామర్ బ్యూటీ ఎవరో తెలిసిందోచ్..!

 

Advertisement
Exit mobile version