Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Pawan-Allu Arha : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీలో అల్లు అర్హ‌.. రోల్ ఇదేనట!

Pawan Kalyapawan-allu-arha-allu-arha-acts-as-pawan-kalyan-daughter-in-ustaad-bhagat-singh Allu Arha

Pawan Kalyapawan-allu-arha-allu-arha-acts-as-pawan-kalyan-daughter-in-ustaad-bhagat-singh Allu Arha

Pawan-Allu Arha : టాలీవుడ్ ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) కొత్త మూవీ రాబోతోంది. ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) మూవీని డైరెక్ట‌ర్ హ‌రీష్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్పటికే మూవీ లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. త‌మిళ మూవీ ‘తెరి’ (Theri)కి రీమేక్ అని అంటున్నారు.

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ మూవీని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో తెరకెక్కించనున్నాడు. సినిమా కాన్సెప్ట్ మినహా అన్నిుంటిని రిమేక్ లో మార్చే అవకాశం ఉంది. తెరి మూవీలో హీరో బేక‌రి ర‌న్ చేస్తుంటాడు. అయితే తెలుగు రిమేక్‌లో మాత్రం హ‌రీష్ శంక‌ర్.. ప‌వ‌న్‌ను టీచర్ రోల్‌లో చూపించనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.

Pawan Kalyapawan-allu-arha-allu-arha-acts-as-pawan-kalyan-daughter-in-ustaad-bhagat-singh Allu Arha

అయితే, ఈ మూవీలో ప‌వ‌న్‌కు ఒక కూతురు ఉంటుంది. ఆ పాప రోల్ చేసేది ఎవరు అనేది చాలా ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి నెట్టింట అనేక వార్తలు వైర‌ల్ వస్తున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ (Allu Arjun) కుమార్తె అల్లు అర్హ (Allu Arha).. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌లో ప‌వ‌న్ కుమార్తెగా నటించనుంది. ఇందులో నిజమెంత అనేది కొన్ని రోజులు ఆగాల్సిందే. అల్లు అర్హ కెమెరా ముందు న‌టించ‌డం కొత్తేమీ కాదు. శాకుంత‌లం మూవీలో అల్లు అర్హ చిన్ననాటి భ‌ర‌తుడి రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Read Also : Naresh Shocking Comments : అందుకే నన్ను చంపాలనుకుంది.. రమ్య రఘుపతిపై నరేష్ సంచలన కామెంట్స్!

Exit mobile version