G
Telugu News » Entertainment » nayanathara marrige date fix marrige in tirupati
⚡ Entertainment, Latest

Nayanathara : పెళ్లి ముహూర్తం కుదిరింది.. తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకోనున్న నయనతార!

Nayanathara: లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న నయనతార గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Nayanathara: లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న నయనతార గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఓకే ఫ్లాట్లో నివసిస్తున్నారని పెద్దఎత్తున వీరి గురించి వార్తలు షికార్లు చేశాయి. ఇకపోతే ఇదివరకే ఈ జంట నిశ్చితార్థాన్ని జరుపుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక త్వరలోనే వీరిద్దరూ కేరళలో చర్చిలో వివాహం చేసుకోనున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే తాజాగా నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి ముహూర్తం కూడా కుదిరిందని వార్తలు వస్తున్నాయి. జూన్ 9వ తేదీ ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. అయితే కేరళలో చర్చిలో వీరి వివాహం జరుగుతుందన్న వార్తలలోఏ మాత్రం నిజం లేదు వీరి పెళ్లి కలియుగ దైవమైన శ్రీ వారి సన్నిధిలో జరగనున్నట్లు సమాచారం.

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా నయనతార విఘ్నేష్ శివన్ తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకున్న అనంతరం వీరి పెళ్లికి కావలసిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇన్ని రోజుల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ ప్రేమ పక్షులు ఎట్టకేలకు జూన్ 9వ తేదీ మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read Also : Actress Himaja: హిమజా పెళ్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయినా తల్లి.. తోడు వద్దా అంటూ!

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷kollywoodmarrigeNayanatharavignesh
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు