Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. తనను బాయ్ ఫ్రెండ్ అందుకే వదిలేశాడంట..!

Mrunal Thakur reveals ex-boyfriend ‘ran away’, told her, You are an actress

Mrunal Thakur reveals ex-boyfriend ‘ran away’, told her, You are an actress

Mrunal Thakur : సినీనటి మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను హీరోయిన్ అని తెలిసిన ప్రియుడు తనను వదిలేశాడంటూ పాత చేదు అనుభవాలను బయటపెట్టింది.
తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సూపర్ 30 (Super 30) మూవీతో సిల్వర్ స్ర్కిన్‌పై కనిపించింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ సరసన నటించి మంచి హిట్ అందుకుంది. అప్పటినుంచి వరుస ఆఫర్లతో తెగ బిజీ అయిపోయింది.

ఈ ముద్దుగుమ్మ హిందీ వెర్షన్ జెర్సీ (Jersey) మూవీలో నటిస్తోంది. తెలుగులో నేచరుల్ స్టార్ నాని (Natural Nani) నటించిన జెర్సీ మూవీకి హిందీ రిమేక్.. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితాన్ని గురించి కొన్ని విషయాలను రివీల్ చేసింది.

తాను వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. తనకు 7 నెలల క్రితమే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయినట్టు చెప్పింది. ఎంతోగానూ ప్రేమించిన వ్యక్తి ట్రేడేషనల్ ఫ్యామిలీకి చెందిన వాడిగా చెప్పింది. వారి పద్దతులు, కట్టుబాట్లను ఎక్కువగా ఫాలో అయ్యే ఫ్యామిలీ కావడంతో తాను ఇష్టపడ్డామని చెప్పింది. తాను ఎప్పుడైతే హీరోయిన్ అని తెలిసిందో.. అప్పటినుంచి అతడు తనను దూరం పెట్టాడని వాపోయింది.

Advertisement

సినిమాల్లో నటిస్తానని తెలిసి తనకు దూరంగా పారిపోయాడని చెప్పింది. తనను వదిలేసిన వెళ్లినా తన ప్రియుడిపై ఎలాంటి కోపం లేదని తెలిపింది. తనకు తానే ధైర్యం చెప్పుకుని ముందుకు సాగుతున్నట్టు తెలిపింది. పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పడంతో పెద్దగా ఆలోచించడం లేదని చెప్పింది. ప్రస్తుతానికి కెరీర్ పైనే ఫోకస్ పెట్టినట్టు మృణాల్ ఠాకూర్ తెలిపింది.

Read Also : Anantapur Murder : భార్యకు ఉరేశాడు.. పసిబిడ్డ గొంతునులిమేశాడు.. పోలీసులనే కన్నీళ్లు పెట్టించింది..!

Advertisement
Exit mobile version