Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg boss Season 6 : బిగ్ బాస్ లో మొగుడు, పెళ్లాల గలీజ్ పంచాయతీ.. మధ్యలోకి వచ్చిన శ్రీసత్య!

Bigg boss Season 6 :  బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న రచ్చపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. చాలా మంది బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా నిజంగా అలాగే బిహేవ్ చేస్తున్నారని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో మెగుడు, పెళ్లాలుగా వెళ్లిన మెరీనా అండ్ రోహిత్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్నారు. వారిద్దరి మధ్య జరిగిన ఓ పంచాయతీ అందరికీ రోత పట్టిస్తోందని అంటున్నారు. అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Merina and rohith highlighted in bigg boss 6 telugu

వచ్చిన మొదటి రోజు నుంచే గొడవ పడుతున్న వారిద్దరూ… నిన్న మరీ ఎక్కువగా కొట్టేస్కున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్లలో ఎక్కువ మంది పెళ్లి కాని అమ్మాయిలు ఉండటంతో తన భర్త రోహిత్ పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతోంది మెరీనా. ఇంతలో సీన్ లోకి వచ్చిన శ్రీ సత్యతో వారిద్దరి మధ్య గొడవ మరితం పెద్దగా అయింది. శ్రీ సత్యతో రోహిత్ ్లోజ్ గా ఉండడం చూసి మెరీనా సహించలేకపోతుంది. నా మొగుడితో మాట్లాడలంటుంటే నీవు అలా ఎలా తీసికెల్లిపోతావంటూ గొడవ పడింది మెరీనా. అంతే కాదండోయ్.. ఏడుస్తూ వెళ్లిపోయింది. అంతా ఆమె వెనుకే పరిగెత్తగా.. శ్రీసత్య సారీ చెప్పి మరీ ఇదంతా ప్రాంక్ అని తేల్చేసింది.

Read Also : Bigg Boss 6 Nominations : బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే.. సేఫ్ జోన్ లో బాలాదిత్య!

Advertisement
Exit mobile version