Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Jabardasth Kiraak RP : జబర్దస్త్‌పై కిర్రాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్.. అంతా నిజమే.. ఇవిగో ఫ్రూప్స్!

Jabardasth Kiraak RP : బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులను ఈ కామెడీ షో అంతగా ఆకట్టుకుంటోంది. ఎంతోమంది జబర్దస్త్ ద్వారా అనేక సినిమా అవకాశాలను దక్కించుకున్నారు. చాలామంది జబర్దస్త్ కమెడీయన్ల కెరీర్ గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. అలా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న జబర్దస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చింది. జబర్దస్త్ అనే పేరును చాలామంది కమెడియన్లు తమ ఇంటిపేరుగా మార్చేసుకునేంతగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటివరకూ ఈ కామెడీ షోలో చేసిన వాళ్లు దాదాపు సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కళ్లు ఒక రేంజ్‌లో ఎదిగిపోయారు.

Jabardasth Kiraak RP Sensational Comments on Jabardasth Comedy Show

అయితే కొన్ని రోజులుగా జబర్దస్త్ కామెడీ షోను నడిపే మల్లెమాల నిర్వాహకుల గురించి ఏదో ఒక విషయం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగబాబు ఈ జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్లిన తర్వాత చాలా మంది కమెడియన్లు జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేశారు. నాగబాబు బయటకు రావడమే ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. ఆయన వస్తు వస్తూనే ఆ షో మీద ఘాటు విమర్శలు చేశాడు. తనతోపాటు చాలామంది ఆర్టిస్టులు బయటకు వచ్చేశారు. ధనరాజ్, చమ్మక్ చంద్ర, వేణువండర్స్ బయటకు వచ్చేశారు.

Jabardasth Kiraak RP : సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా ఆర్పీ కామెంట్స్.. 

ఇప్పుడు కిర్రాక్ ఆర్పీ వంటి కూడా బయటకు వచ్చేశాడు. ఇలా వారంతా మరో ఛానల్లో షోలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఆర్పీ జబర్దస్త్ షో మీద చేసిన ఘాటు విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారాడు కిర్రాక్ ఆర్పీ. ఒకప్పుడు ఈ జబర్దస్త్ కామెడీ షోనే తన తల్లి లాంటిదని చెప్పుకొచ్చిన ఆర్పీ ఇప్పుడు ఇలా విమర్శలు చేయడాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగి ఉంటుంది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.  ఏదైతే సంస్థ ద్వారా తాను ఆర్దికంగా స్థిరపడ్డాడో.. ఏ షో ద్వారా తాను పేరు సంపాదించుకున్నాడో.. ఇప్పుడు అదే సంస్థపై ఆర్పీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. ఇటీవలే.. జబర్దస్త్ కామెడీ షో ప్రొడక్షన్ వారు పెట్టే ఫుడ్.. కుక్కలు కూడా తినవంటూ ఓ ఇంటర్వ్యూలో ఆర్పీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి పైన ఆర్పీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

అంతేకాదు.. మల్లెమాల లాంటి నీచమైన ప్రొడక్షన్ కంపెనీ ప్రపంచంలో ఎక్కడ ఉండదని ఆర్పీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ అంటే ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లుగా సైలెంట్‌గా ఉండి.. మరి ఇప్పుడు ఇంతగా ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు అని ఆర్పీని యాంకర్ ప్రశ్నించగా.. దానికి ఇలా సమాధానం ఇచ్చాడు. తల్లి బిడ్డను కనాలంటే తొమ్మిది నెలలు నిండాలి కదా.. ఒకటో నెలలోనే బిడ్డను కనేస్తుందా?అని అన్నాడు. రేపటిరోజున రోజున జబర్దస్త్ కామెడీ షో నుంచి ఆది కూడా బయటికి వస్తాడని ఆర్పీ చెప్పుకొచ్చాడు.

అయితే ఆర్పీ చేసిన వ్యాఖ్యలను జబర్దస్త్ కమెడియన్లు రంగంలోకి దిగారు. ఈ విషయంలో ఆటో రాంప్రసాద్, ఆది వంటి వాళ్లు కూడా ఆర్పీదే తప్పు అని ఖండించారు. కానీ, ఆర్పీ మాత్రం తాను చెప్పిన మాటలన్నీ నిజమేనని అంటున్నాడు. తన దగ్గర ప్రూఫ్స కూడా ఉన్నాయని అంటున్నాడు ఆర్పీ. ఆ ఆడియో ప్రూఫ్స్ తాను బయటపెట్టలేనని అంటున్నాడు. కానీ, తన దగ్గర ఫోన్ రికార్డింగ్ వాయిస్ ఉన్నాయని అంటున్నాడు. అందులో మల్లెమాల తమను ఎంతగానో ఇబ్బంది పెట్టిందని చెబుతున్నాడు. తన వ్యాఖ్యలను ఖండించిన ఆటో రాం ప్రసాద్, ఆదిలకు కూడా తాను గట్టిగానే కౌంటర్ ఇవ్వగలని అంటున్నాడు. తాను చెప్పింది అబద్దమైతే గుండు కొట్టించుకోవడానికి కూడా రెడీ అంటున్నాడు ఆర్పీ.

Read Also : Kiraak RP : కిరాక్ ఆర్పీ లవ్ స్టోరీ తెలుసా.. సినిమా లెవెల్ లో ఉందిగా!

Advertisement
Exit mobile version